తెలంగాణలో ఉప ఎన్నికలు... ఏపీలో రాష్ట్రపతి పాలన..?
పొరుగు రాష్ట్రంలో తమ మిత్రపక్షం వైసిపి ఢిల్లీ దాకా వెళితే మేము ఎందుకు ? వెళ్ళకూడదు అనుకున్నారో ఏమో కానీ బిఆర్ఎస్ నేతలు కేటీఆర్ - హరీష్ రావు కూడా ఢిల్లీ పర్యటన చేపట్టారు. అక్కడ కూడా వారిద్దరూ చాలా కామెడీగా తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని ప్రకటించి నవ్వుల పాలయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పోలు పోతుంది. తిరిగి బి ఆర్ ఎస్ అధికారంలోకి వస్తుంది అంటూ మైండ్ గేమ్ మొదలుపెట్టారు. మరి గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు .. ఎమ్మెల్యేలు .. ఎమ్మెల్సీలను తమ పార్టీలో చేర్చుకుని గులాబీ కండువా కప్పినప్పుడు కేటీఆర్ - హరీష్ రావుకు ఈ నీతి సూత్రాలు ఎందుకు గుర్తు రాలేదో వారే చెప్పాలి. ఏది ఏమైనా వైసీపీ - బీఆర్ఎస్ పార్టీలకు అధికారం పోవడంతో వారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి.