ఏపీ: హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం జగన్..?

FARMANULLA SHAIK
వైఎస్ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిగత భద్రత విషయంలో ఆయన కోర్టును ఆశ్రయించారు. తనకు ఉన్న సెక్యూరిటీని కొనసాగించేలా కోర్టు ఆదేశాలు జారీ చేయాలని జగన్ పిటిషన్ లో పేర్కొన్నారు. అంతే కాకుండా కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా సెక్యురిటీని తొలగించినట్టు జగన్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.తాజాగా ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఏకపక్షంగా తనకు ఉన్న సెక్యూరిటీ తొలగించినట్లు తెలిపారు. తనను అంతమొందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అలాగే తనకు ప్రాణహాని ఉన్న అంశాన్ని పరిశీలించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని అన్నారు. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా లేదని పిటిషన్‌లో తెలిపారు.జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు హై సెక్యూరిటీ ఉండేది. తాడేపల్లి నివాసం దగ్గర పెద్ద ఎత్తున సెక్యూరిటీ పనిచేసేది. జగన్‌ ఇంటికి వెళ్లే దారిలోనూ చెక్‌ పోస్టులు ఉండేవి. సుమారు 300 మంది రక్షణలో జగన్‌ ఉండేవారు. అయితే ఏపీలో పాలన మారడంతో.. ఆయన సెక్యూరిటీ విషయంలోనూ మార్పులు జరిగాయి. పెద్ద ఎత్తున సెక్యూరిటీని తొలగించారు. దీంతో ప్రైవేట్‌ సెక్యూరిటీని పెట్టుకున్న ఆయన… ప్రభుత్వ తీరుపై నిప్పులు కక్కుతున్నారు. ఏపీలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నా… కావాలనే తన సెక్యూరిటీ విషయంలో ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. తనకు గతంలో ఉన్న భద్రతను కొనసాగించాలన్నారు. ప్రాణహాని ఉన్న అంశాన్ని కూడా పరిశీలించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ… హైకోర్టును ఆశ్రయించారు. మొత్తంగా… సెక్యూరిటీ విషయంలో జగన్‌ హైకోర్టుకు వెళ్లడం చర్చనీయాంశమైంది.అయితే జగన్ పిటిషన్‌పై పోలీస్ శాఖ, ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. సీఎం హోదాలో అదనంగా ఇచ్చే భద్రతను మాత్రమే తగ్గించామని స్పష్టం చేశాయి. ఇప్పుడు అదే సెక్యూరిటీ కల్పించడం కుదరదని తేల్చి చెప్పాయి. జగన్‌కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతుందని పేర్కొన్నాయి. నిబంధనల ప్రకారమే జగన్‌కు భద్రత కల్పిస్తున్నామని వెల్లడించాయి. జగన్‌కు భద్రత తగ్గించారన్న వాదనను కొట్టిపారేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: