భట్టి విక్రమార్క లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా.. మొదట లవ్ ప్రపోజ్ చేసింది ఎవరంటే?

frame భట్టి విక్రమార్క లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా.. మొదట లవ్ ప్రపోజ్ చేసింది ఎవరంటే?

Reddy P Rajasekhar
తెలంగాణ రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుని మంచి పేరును సంపాదించుకున్న నేతలలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఒకరని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. పైకి గంభీరంగా కనిపించినా అందరితో మృదువుగా మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇచ్చే నేతగా భట్టి విక్రమార్కకు పేరుంది. భట్టి విక్రమార్క ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే సంగతి చాలా తక్కువమందికి తెలుసు.
 
ఖమ్మం జిల్లాలోని లక్ష్మీపురం భట్టి విక్రమార్క స్వస్థలం కాగా ఆయన తండ్రి ఆయుర్వేద వైద్యుడుగా పని చేసేవారు. చదువుకునే సమయంలోనే రాజకీయాలపై ఫోకస్ పెట్టిన భట్టి విక్రమార్క అంచెలంచెలుగా ఎదిగారు. గుజరాత్ నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడిన నందిని అనే యువతి, భట్టి విక్రమార్క ఒకే యూనివర్సిటీలో చదువుకున్నారు. నందిని మొదట తన ప్రేమను భట్టి విక్రమార్కకు తెలియజేశారు.
 
నందిని మంచితనం, ప్రేమించే గుణం, సేవా భావం నచ్చి భట్టి విక్రమార్క కూడా వెంటనే ఆమెకు యస్ చెప్పేశారు. అయితే భట్టి విక్రమార్క పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కావడంతో నందిని కుటుంబం మొదట పెళ్లికి అంగీకరించలేదు. అయితే ఆ తర్వాత భట్టి విక్రమార్క ప్రవర్తన నచ్చి పెళ్లికి అంగీకరించారు. భట్టి విక్రమార్క పొలిటికల్ గా సక్సెస్ కావడంలో నందిని పాత్ర ఎంతో ఉందని చెప్పవచ్చు.
 
పలు సందర్భాల్లో ఎన్నికల ప్రచారంలో సైతం నందిని పాల్గొన్నారు. భట్టి విక్రమార్క పాదయాత్ర చేసిన సమయంలో సైతం నందిని ఎంతో ప్రోత్సహించి అండగా నిలిచారు. అటు పర్సనల్ లైఫ్ లో ఇటు పొలిటికల్ లైఫ్ లో సక్సెస్ సాధించి భట్టి విక్రమార్క ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. రైతు రుణమాఫీని అమలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: