పవన్ అన్నా లెజినోవా క్యూట్ కపుల్ అంటున్న ఫ్యాన్స్.. ఆమె పవన్ కు లక్కీ ఛార్మ్ అంటూ?

frame పవన్ అన్నా లెజినోవా క్యూట్ కపుల్ అంటున్న ఫ్యాన్స్.. ఆమె పవన్ కు లక్కీ ఛార్మ్ అంటూ?

Reddy P Rajasekhar
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయాలలో ఇటు సినిమాలలో టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే. పవన్ తర్వాత సినిమాలన్నీ సులువుగా 100 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. పవన్ కెరీర్ లో ప్రస్తుతం గోల్డెన్ డేస్ నడుస్తున్నాయని పవన్ కళ్యాణ్ ఏది పట్టుకున్నా బంగారం అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
2019 ఎన్నికల్లో ఒక్క సీటుతో మొదలైన జనసేన ప్రస్థానం 2024 ఎన్నికల సమయానికి 21 స్థానాలకు చేరింది. రాబోయే రోజుల్లో పవన్ సీఎం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు. పవన్, అన్నా లెజినోవా ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే సంగతి తెలిసిందే. అన్నా లెజినోవా పవన్ జీవితంలోకి వచ్చిన తర్వాత పవన్ కు కెరీర్ పరంగా ఎంతో కలిసొచ్చిందని ఫ్యాన్స్ చెబుతున్నారు.
 
అన్నా లెజినోవా తీన్ మార్ అనే సినిమాలో నటించగా ఆ సమయంలో పవన్, ఆన్నా లెజినోవా మధ్య పరిచయం ఏర్పడింది. తీన్ మార్ మూవీ లవ్ ఆజ్ కల్ రీమేక్ కాగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోకపోయినా ఈ సినిమా తర్వాత పవన్ నటించిన గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించడం గమనార్హం.
 
2014 ఎన్నికల్లో జనసేన సపోర్ట్ తో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగా 2024లో జనసేన సంచలన ఫలితాలను సొంతం చేసుకుంది. అన్నా లెజినోవా పవన్ కు లక్కీ ఛార్మ్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. భారతీయ సాంప్రదాయాలను అన్నా లెజినోవా ఎంతో గౌరవిస్తారనే సంగతి తెలిసిందే. అన్నా లెజినోవా లాంటి భార్య దొరకడంతో పవన్ మరింత లక్కీ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అన్నా లెజినోవా ఇటీవల మాస్టర్స్ డిగ్రీ అందుకున్న సంగతి తెలిసిందే. పవన్, అన్నా లెజినోవా కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: