కొడాలి నానికి క్యాన్సర్‌...రంగంలోకి దిగిన పేర్ని నాని ?

frame కొడాలి నానికి క్యాన్సర్‌...రంగంలోకి దిగిన పేర్ని నాని ?

Veldandi Saikiran

వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నానికి క్యాన్సర్  వచ్చిందని, వంశీని అరెస్టు చేసారని టీడీపీ వాళ్లు శునకానాందం పొందుతున్నారని ఆగ్రహించారు వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని. ఏలూరు జిల్లా నూజివీడు సబ్ జైలులో అరెస్ట్ కాబడిన వైసీపీ కార్యకర్తలను పరామర్శించారు మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. అనంతరం వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ... టీడీపీ గుండాలపై ఎదురు తిరిగిన వంశీపై కేసులు పెట్టారన్నారు.

వంశీ న్యాయపరంగా రిలీఫ్ పొందిన తర్వాత వస్తారని... టీడిపి వాళ్లు ఎన్నాళ్లు ఇలా శునకానందం పొందుతారో చూద్దామని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేయటం టీడీపీ పక్కన పెట్టేసిందని.. వైసీపి జెండా మోసినా వారిని జైల్లో పెట్టడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని. ఇసుక, మట్టి, లే అవుట్లు ఎక్కడ ఉన్నాయి అనేది చూసుకుంటున్నారని తెలిపారు వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని.
మీటింగ్స్ లో మాత్రం అమరావతి, అభి వృద్ది, సంపద సృష్టి అని కబుర్లు చెబుతున్నారని.. తెర వెనుక మాత్రం ఇసుక మట్టి  లే అవుట్లు గురించే  మాత్రమే చర్చ జరుగుతోందని తెలియజేశారు. వైసీపి కార్యకర్తలను జైల్లో నింపటం మాత్రమే టీడిపి ప్రభుత్వం చేస్తోందని ఆగ్రహించారు. కాలం గిర్రున తిరిగి వస్తుంది అనే విషయం తెలుసు కోవాలని కోరారు.  టీడీపీ ప్రభుత్వం  పైశాచిక ఆనందం పొందుతోందని... పైశాచిక ఆనందం పొందిన వారిపై త్వరలోనే అనుభవిస్తారని స్పష్టం చేశారు వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని.
కేంద్ర ప్రభుత్వం కులగణనతో పాటు జనగణన కూడా జరపాలని... ఆరోగ్యశ్రీ పథకానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి చెప్పే ప్రయత్నం చేస్తుందని ఫైర్ అయ్యారు. పేదవాడిని అట్టడుగు స్థాయికి తొక్కేసే ప్రయత్నం జరుగుతుందన్నారు వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: