మందకృష్ణ మాదిగ: చంద్రబాబు వల్లే ఎస్సీ వర్గీకరణ సాధ్యం..!

Divya
ఈ రోజున ఎస్సీ రిజర్వేషన్కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం పైన ఎమ్మార్పీఎస్ అధినేత అయినటువంటి మందకృష్ణ మాదిగ ఈ విషయాన్ని చాలా ఆనందంగా తెలియజేస్తూ ఎమోషనల్ గా మాట్లాడారు.. ఎస్సీ  వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ 30 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉందని అందుకు తగ్గ ఫలితం ఈరోజు లభించింది అంటూ ఉద్వేగంగా మాట్లాడడం జరిగింది. అయితే ఎస్సీ వర్గీకరణ చేసింది గతంలో గుమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అంటూ తెలిపారు.

ఏపీలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే ఈ వర్గీకరణ జరుగుతుందని కూడా తెలియజేయడం జరిగింది. ఇందుకు సహకరించిన చంద్రబాబుకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలను తెలియజేశారు మందకృష్ణ మాదిగ. చంద్రబాబు వర్గీకరణ చేయకపోతే వేలాదిమందికి ఉద్యోగాలు వచ్చేవి కావని కూడా తెలియజేశారు.. ఒకవేళ న్యాయం బ్రతికి ఉంటే చంద్రబాబు తీసుకొచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ ద్వారానే అది సాధ్యమవుతుంది అంటూ మందకృష్ణ మాదిగ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.. చంద్రబాబుతో పాటుగా 30 ఏళ్లుగా వర్గీకరణకు ఉద్యమానికి మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అంటూ తెలియజేశారు ఎమ్మార్పీఎస్ అధినేత.

ఈ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన ఎంతో మంది నేతలకు ఈ విజయం అంకితం అని కూడా తెలిపారు. అనుకూల తీర్పు ఇచ్చిన జడ్జిలకు కూడా ఇది ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటూ తెలిపారు..విద్య ఉద్యోగ అంశాలలో ఎస్సీ ఉపకులాల ఆధారంగా వర్గీకరణ చేస్తూ అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు కనిపించాలని కూడా సుప్రీంకోర్టు డిమాండ్ చేయడం ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చాలా ఆనందంగా ఉందంటూ తెలిపారు. ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనంలో ఈ విషయాన్ని తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది అంటే తెలిపారు. ప్రస్తుతం మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. మరి వీటివల్ల ఎస్సీ ఎస్టీలకు ఏ మేరకు అవకాశాలు లభిస్తాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: