ఎస్సీ వర్గీకరణ: 30 ఏళ్ల నాటి కల.. సుప్రీంకోర్టు తీర్పుతో నెరవేరిందా.?

Divya
ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు తాజాగా తీర్పు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.ఈ విషయం పైన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోజున ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు కూడా ఉందంటూ తీర్పు ఇచ్చారు.. ఏడుగురు జడ్జిలతో కలిసి రాజ్యాంగ ధర్మాసనం కూడా తెలియజేసినట్లు తెలియజేశారు మందకృష్ణ మాదిగ.. సుప్రీంకోర్టు తీర్పున సైతం పేదవర్గాలకు అండగా నిలబడడం కోసమే ఈ తీర్పు ఇచ్చిందంటూ ఆయన వ్యాఖ్యానించారు.

అయితే తాను చేసిన పోరాటం ఇన్నేళ్లకు మంచి విజయాన్ని అందుకుంది అంటూ బాగా ద్వేగానికి లోనయ్యారు.. న్యాయం వైపు సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం హర్షనీయంగా ఉంది అంటూ తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం సుమారుగా 30ఏళ్ల పాటు పోరాటం చేస్తూనే ఉంది ఎంఆర్పిఎస్ అంటూ తెలిపారు. జాతిని గెలిపించడం కోసం జరిగిన ఈ పోరాటంలో ఎంతో మంది ఎంఆర్పిఎస్ ఉద్యమకారులు ప్రాణ త్యాగాలు కూడా చేశారని వారి విజయానికి ఇదే అంకితం అంటూ న్యాయాన్ని గెలిపించడం కోసం జరిగిన ఈ పోరాటంలో నిలబడిన ప్రతి ఒకరికి కూడా ధన్యవాదాలు అంటూ తెలిపారు.

విద్యాసంస్థలలో ప్రవేశాల కోసం అలాగే ప్రభుత్వ ఉద్యోగాలను ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను సైతం ఉప వర్గీకరణ చేసేందుకు అధికారం ఉంటుంది ఆయా రాష్ట్రాలకు అంటూ న్యాయస్థానం తెలియజేసింది. ఒక కులంలో ఉపవర్గాలు చేసేందుకు రాజ్యాంగం లోని 14వ అధికరణ అనుమతి కల్పిస్తుంది అంటూ తెలియజేశారు. అన్నగారిన వర్గాలకు మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు ఈ రిజర్వుడ్ కేటగిరీలలో ఉప వర్గీకరణ చేసుకోవచ్చు అంటూ కోర్టు తీర్పుని ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాలా మాదిగలలో మాలలే ఎక్కువమంది ఉన్నారట. 2011 నాటికి ఉమ్మడి ఏపీలో కోటి 34 లక్షల మంది ఉండగా ఎస్సీలలో 66 లక్షల మంది మాదిగలు 54 లక్షల మంది మాలలు ఉన్నారట. మరి వీటి వల్ల మరి అందరికీ అవకాశాలు దక్కుతాయా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: