సినిమావాళ్లకు జగన్ డర్టీ పిక్చర్? సామాన్యులకు మేలేగా?

Purushottham Vinay
• టాలీవుడ్ కి చుక్కలు చూపించిన జగన్! 

• టికెట్ రేట్లు తగ్గించిన హిట్ అయిన కొన్ని సినిమాలు! 

• జగన్ నిర్ణయం సామాన్యులకి వరం. సినిమావాళ్లకి గుణపాఠం! 


అమరావతి - ఇండియా హెరాల్డ్: 2019లో వైసీపీ భారీ మెజారిటీతో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సినిమా ఇండస్ట్రీకి చుక్కలు చూపించాడు. సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేశారు.ముఖ్యంగా తన ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ సినిమా వాడు కావడంతో ఇంకా రెచ్చిపోయాడు జగన్.చాలా సందర్భాలలో పవన్ ని పర్సనల్ టార్గెట్ చేసి కామెంట్లు చేసిన జగన్ పవన్ ను ఆర్థికంగా దెబ్బ కొట్టాలనే ఆలోచనతో పవన్ సినిమాలతో పాటు చాలా సినిమాలు విడుదలైన సమయంలో టికెట్ రేట్లను తగ్గించడం సినిమా ఇండస్ట్రీకి గట్టి షాక్ ఇచ్చింది. లాక్ డౌన్ ముందు ఒక లెక్క అయితే లాక్ డౌన్ తరువాత సినిమా ఇండస్ట్రీ పై ఇంకా దారుణంగా జగన్ విరుచుకుపడ్డాడు. మరీ ముఖ్యంగా వకీల్ సాబ్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్, అఖండ సినిమాల రిలీజ్ కు ముందు టికెట్ రేట్లను భారీగా తగ్గించాడు. తగ్గించిన టికెట్ రేట్ల విషయంలో తీవ్రస్థాయిలో టాలీవుడ్ ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ కామెంట్లు బాగా వ్యక్తమయ్యాయి.జగన్ టికెట్ రేట్లు తగ్గించడంతో మూవీ ఏపీ హక్కులను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు దారుణంగా నష్టపోయారు. చాలా సినిమాలు రిలీజైన కొన్ని రోజుల వరకు ఇవే టికెట్ రేట్లు కొనసాగాయి.అయితే ఇలా సినిమా ఇండస్ట్రీకి చుక్కలు చూపించినా కానీ కొన్ని సినిమాలు బాగానే హిట్ అయ్యాయి. 


ఎందుకంటే ఆ తగ్గించిన రేట్లు సామాన్య ప్రజలకు ఊరట కలిగించాయి. జగన్ మరీ అంత దారుణంగా అయితే టికెట్ రేట్లు తగ్గించలేదు కానీ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తగ్గించాడు. కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇందులో జగన్ ని తప్పు బట్టడానికి ఏమి లేదు. కంటెంట్ బాగుంటే టికెట్ రేట్లు ఎలా ఉన్న సినిమా ఆడుతుందని చాలా సినిమాలు నిరూపించాయి. అంతకముందు దారుణంగా టికెట్ రేట్లు పెంచి, థియేటర్లలో తిను బండారాల రేట్లని దారుణాతి దారుణంగా పెంచి మధ్య తరగతి ప్రజలకు ఇది వినోదం అంటూ చుక్కలు చూపించిన సినిమా ఇండస్ట్రీకి, థియేటర్స్ ఓనర్లకి జగన్ టికెట్ రేట్లు తగ్గించి డర్టీ పిక్చర్ చూపించాడు. సామాన్యులకు వినోదాన్ని చవకగా అందించాడు. ఇది తెలియని అమాయకపు ఫ్యాన్స్ తాము  ఏమైనా పరవాలేదు మా హీరోలు బాగుండాలి.. మా TFI బాగుండాలి..  అని జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు తప్ప జగన్ అందరికీ సినిమా టికెట్ల రేట్ల విషయంలో సమ న్యాయం చేశారనే సంగతి గుర్తించలేకపోయారు. ఈ వ్యవహారం కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చలేదు. ఏది ఏమైనా కానీ జగన్ పరిపాలనలో టాలీవుడ్ మాత్రం బాగానే నలిగిపోయింది అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: