11 ఏళ్ల అత్తారింటికి దారేది : బ్రేక్ ఈవెంట్ టార్గెట్.. వచ్చిన లాభాలు ఎంతో తెలుసా..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో చాలా విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరియర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న సినిమాలలో అత్తారింటికి దారేది మూవీ ఒకటి. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా ... సమంత , ప్రణీత ఈ మూవీ లో హీరోయిన్లుగా నటించారు. రావు రమేష్ , నదియా ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమా 2013 వ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయి తాజాగా 11 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఈ సినిమాకు ఆ సమయంలో ఎన్ని కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్లను రాబట్టి , ఎన్ని కోట్ల లాభాలను అందుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ కి నైజాం ఏరియాలో 23.25 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 10.46 కోట్లు , ఉత్తరాంధ్రలో 6.22 కోట్లు , ఈస్ట్ లో 4.07 కోట్లు , వెస్ట్ లో 3.38 కోట్లు , గుంటూరు లో 5.25 కోట్లు , కృష్ణ లో 3.72 కోట్లు , నెల్లూరు లో 2.63 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 58.98 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి రెస్ట్ ఆఫ్ ఇండియాలో 7.11 కోట్లు , ఓవర్సీస్ లో 8.90 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి 74.99 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ మూవీ 51 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా , 74.99 కోట్ల షేర్ కలక్షన్లను రాబట్టి 23 కోట్ల లాభాలను ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని ఆ సమయంలో అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: