సినీ రాజకీయం... గొడవలు : రేవంత్ రాకతో నైజాంలో మారిన సినిమా లెక్కలు..?

Pulgam Srinivas
కొన్ని సంవత్సరాల క్రితం వరకు రాజకీయ నాయకులు ఎక్కువ శాతం సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాలను ఎక్కువగా పట్టించుకునేవారు కాదు. సినిమా వాళ్లు తమ సొంతగా నిర్ణయాలు తీసుకునేవారు. దాదాపు వాటిని ప్రభుత్వాలు కూడా ఎలాంటి అడ్డు లేకుండా ఆమోదం తెలుపుతూ ఉండేవి. కానీ గత పది సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో రాజకీయ నాయకుల జోక్యం కాసింత ఎక్కువ గానే పెరిగింది.

2014 కంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో ఒకరే సీఎం ఉండడం వల్ల ఒకరి దగ్గర నుండి పర్మిషన్ వస్తే టికెట్ రేట్ల పెంపు , అదనపు షో ల వెసులుబాటు ఉండేది. కానీ 2014 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోవడంతో సినిమా పరిశ్రమకు సంబంధించిన వారు ఏ పర్మిషన్ రావాలి అన్న అటు ఆంధ్ర ప్రభుత్వము నుండి , ఇటు తెలంగాణ ప్రభుత్వం నుండి పర్మిషన్లను పొందవలసి వస్తుంది.

దానితో కొన్ని వెసులుబాటులో ఆంధ్రప్రదేశ్లో ఉంటే కొన్ని బేసులు బాట్లు తెలంగాణలో ఉంటున్నాయి. ఇకపోతే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐదు షోలకు , 6 షోలకు పర్మిషన్లు ఇవ్వడం , టికెట్ రేట్లను భారీగా పెంచడం వంటివి చాలానే జరిగాయి. ఇలా పెంచడం కోసం ఆయన వారి దగ్గర నుండి ఏమీ ఆశించింది లేదు.

ఇకపోతే కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సినీ పరిశ్రమకు సంబంధించిన వారు టికెట్ రేట్లు పెంచమని మమ్మల్ని అడుగుతున్నారు. మేము పెంచుతున్నాము. కాకపోతే ఇకపై నుండి ఎవరైనా టికెట్ రేట్లు పెంచాలి అని మమ్మల్ని అడగాలి అంటే వారు సామాజిక బాధ్యతగా గంజాయి , మత్తు పదార్థాలను సేవించడం తప్పు అని తెలియజేస్తూ ప్రజలను మంచి మార్గంలో నడిపే విధంగా ఉండే ఒక వీడియోను విడుదల చేయాలి అని చెప్పుకొచ్చాడు.

ఇకపోతే కొన్ని రోజుల క్రితం ఇండియన్ 2 మూవీ బృందాన్ని టికెట్ రేట్లు పెంచాలి అంటే మీరు సమాజానికి పనికొచ్చే ఒక వీడియో చేయాలి అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు అనే ప్రశ్నను అడగగా సిద్ధార్థ్ ఒకరు చెబితే చేయాల్సిన అవసరం లేదు. నేను ఎవరూ చెప్పని సమయంలోనే ఎన్నో సమాజానికి పనికొచ్చే పనులు చేశాను అని అన్నాడు.

ఇక అది వైరల్ కావడంతో ఆయన స్వారీ కూడా చెప్పాడు. ఇక ఆ మూవీ బృందం వారు డ్రగ్స్ , మాదక ద్రవ్యాలు వాడడం ప్రమాదకరం అనే వీడియోను విడుదల చేసింది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లను కూడా పెంచింది. ఇలా రేవంత్ రెడ్డి కూడా సినిమాలకు సంబంధించిన విషయంలో తనదైన పాత్రను చూపిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: