ఏపీ: చెట్లు కొట్టేయండి...డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు..!

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన ఓ చెట్టు ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఆ చెట్టు చాలా డేంజర్ వెంటనే తొలగించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీంతో అందరూ ఈ చెట్టు గురించి చర్చించుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్‌లో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా స్థానికులు కోనో కార్పస్ (ఏడాకుల) చెట్ల గురించి పవన్ దగ్గర ప్రస్తావించారు.. అటవీ శాఖ సమీక్షలో ఈ అంశంపై వివరించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వాటిని వెంటనే తొలగించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.కాకినాడ జిల్లా వ్యాప్తంగా 35 వేలకు పైగా ఈ కోనో కార్పస్ చెట్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. డిప్యూటీ సీఎం ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌, అటవీశాఖ అధికారులు ఈ తొలగింపు ప్రక్రియను చేపట్టారు.మరోవైపు కోనో కార్పస్ చెట్లు హానికరం అని తెలిసి వాటినివెంటనే తొలగించాలని పవన్ కళ్యాణ్ ఇటీవల ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వాటిని వెంటనే తీసివేయాలని కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా ఈ చెట్లతో తనకు ఉన్న అనుభవాన్ని కూడా పవన్ పంచుకున్నారు. ఈ కోనో కార్పస్ చెట్లను గతంలో తన ఫాంహౌస్‌లో పెంచానన్న పవన్ కళ్యాణ్.. అయితే వాటితో ప్రమాదం అని తెలిసి తీసివేసినట్లు చెప్పారు. కాకినాడ జిల్లాలో ఉన్న ఈ చెట్లను దశల వారీగా తొలగించాలని.. ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. పవన్ ఆదేశాలతో అధికారులు కోనో కార్పస్ చెట్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభించారు.జిల్లా వ్యాప్తంగా 35 వేలకు పైగా ఈ జాతి చెట్లు ఉన్నాయి.అనంతరం నగరంలోని చెట్లను నరికివేయాలని జిల్లా కలెక్టర్‌ సగిలి షాన్‌మోహన్‌ కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
కోనోకార్పస్ చెట్ల దుష్ప్రభావాలపై పర్యావరణవేత్తలు మరియు సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత ఈ అభివృద్ధి జరిగింది. గత రెండేళ్లుగా, అలంకార ప్రయోజనాల కోసం నాటిన చెట్ల హానికరమైన ప్రభావాలను వారు హైలైట్ చేశారు. ఆఫ్రికా స్థానికంగా, ఈ చెట్లు నీటి గజ్లర్‌గా పిలువబడతాయి మరియు మూడు సంవత్సరాలలో విపరీతంగా పెరుగుతాయి. వారు సంవత్సరానికి రెండుసార్లు పరాగసంపర్కం చేస్తారు మరియు పుప్పొడి జలుబు, దగ్గు ఆస్తమా మరియు వ్యక్తులలో అలెర్జీలు వంటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అదనంగా, వారు కాలువలు మరియు మంచినీటి పైప్‌లైన్‌లను కూడా అడ్డుకుంటారు.గతంలో, గుజరాత్ అటవీ శాఖ నర్సరీలు మరియు తోటల వంటి అటవీ మరియు అటవీయేతర ప్రాంతాలలో ఈ జాతి చెట్లను నిషేధించింది.అంతేకాదు ఈ చెట్టు భూ గర్భంలోని జలాన్ని కూడా తోడేస్తుందని.. ఈ చెట్టు ఏపుగా పెరిగిన తర్వాత.. వేరు ఏకంగా 80 మీటర్ల వరూక భూమిలోకి వెళ్లి నీళ్లను తాగేస్తుందంటున్నారు.ఈ కోనో కార్ఫస్ చెట్లను తెలుగులో ఏడాకుల చెట్లు అని కూడా అంటారు.. అలాగే డెవిల్ ట్రీ అని కూడా పిలుస్తారు. అంతేకాదు ఈ చెట్లకు అక్టోబర్ నుంచి జనవరి వరకు పువ్వులు కూడా పూస్తాయి. ఈ చెట్ల పువ్వుల పుప్పొడి కారణంగా ఆస్తమా, శ్వాసకోస ఇబ్బందులు వస్తాయి అంటున్నారు. గతంలో విశాఖపట్నంలో ఈ చెట్ల గురించి చర్చ జరిగింది.. వీటితో ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ చెట్లతో పర్యావరణ వ్యవస్థలో ఎలాంటి ఉపయోగం ఉండదని.. అనేక దుష్ప్రభావాలు ఉంటాయంటున్నారు. అందుకే స్పందించి కోనో కార్పస్ మొక్కలు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకే కాకినాడలో కూడా ఈ చెట్లను తొలగించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: