రాయలసీమ: కడప జిల్లాలో కాల్పులు.. ఆందోళనలో ప్రజలు..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల సమయం ముందు నుంచే ఎక్కువగా గొడవలు రాజకీయ కక్షలు వంటివి జరుగుతూ ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి మరింత ఎక్కువగా వినిపిస్తున్నాయని వైసిపి నేతలు సైతం తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా కడప జిల్లాలోని టీ కోడూరులో కాల్పుల వర్షం కురిపించినట్లుగా తెలుస్తోంది. అలా ఎందుకు జరిగింది ఇది కూడా రాజకీయం గానే అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి చూద్దాం.

అందుతున్న సమాచారం ప్రకారం సోలార్ ప్లాంట్ కు సంబంధించి రాముని రెడ్డి, పవన్ కుమార్ మధ్య గొడవ చెలరేగింది. దీంతో ఇరువురి వర్గాలు సైతం ఒకరి పైన ఒకరు రాళ్లదాడిని చేసుకున్నారట. అయితే ఈ దాడిలో కొంతమందికి స్వల్ప గాయాలు అయ్యాయని తెలుస్తుంది అలాగే మూడు వాహనాలకు సంబంధించి అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయట. ఆ తర్వాత రాం ముని రెడ్డి ఇంటి పైన పవన్ కుమార్ రెడ్డి వర్గీయులు దాడికి తెగబడ్డారు.. దీంతో రాముని రెడ్డి ఒకరి పైన కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సైతం హుటాహుటిగా అక్కడికి బయలుదేరి ఒక వర్గం వారిని కొండాపురం పోలీస్ స్టేషన్ కి తరలించారు.. మరొక వర్గాన్ని తాళ్ల పొద్దుటూరు పిఎస్ కి తరలించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ రోజు వర్గ నేతలు కూడా కూటమికి సంబంధించిన నేతలుగా తెలుస్తోంది.. అయితే గన్నుతో ఒక వర్గం వారు గాలిలో కాల్పులు జరిపినట్లుగా అధికారులు సైతం తెలియజేస్తున్నారు. ఈ రెండు వర్గాలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని.. ఇరువర్గాలని చెదరగొట్టడం జరిగింది.. అయితే ప్రజలు మాత్రం ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దండి అంటూ పోలీసులు తెలియజేస్తున్నారు. ఎవరు కూడా ఎలాంటి కక్ష పాల్పులకు పాల్పడవద్దండి అంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో అక్కడ ప్రజలు సైతం బిక్కుబిక్కుమంటూ ఇళ్ళలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: