ఏపీ: విజయమ్మతో.. జెసి ప్రభాకర్ రెడ్డి భేటీ వెనుక అసలు కథ ఇదే..!

Divya
వైసిపి పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తల్లి వైయస్ విజయమ్మతో టిడిపి సీనియర్ నేత.. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డితో భేటీ కావడం ప్రస్తుతం రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతోంది. జగన్ తో జెసి బ్రదర్స్ రాజకీయంగా చాలా వ్యతిరేకంగా ఉన్న సంగతి తెలిసిందే..2014 లో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు సాక్షి ఎడిషనల్ కార్యాలయం ఎదుట కూడా జెసి ప్రభాకర్ రెడ్డి ఒక దీక్షను కూడా చేశారు.. ఆ సమయంలో జగన్ తో పాటు ఆమె తల్లి విజయమ్మను కూడా దూషించడం జరిగింది.

అప్పట్లో చేసిన వాక్యాల పైన వైసిపి నేతలు కూడా తీవ్రస్థాయిలో విరుచుకు పడడం జరిగింది. 2019లో వైసీపీ పార్టీ అధికారంలోకి రాగానే ఆయన వాహనాలకు సంబంధించి కేసును సైతం ఎదుర్కోవడం జరిగింది. అయితే కొంతకాలం.. జెసి ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి కడప సెంట్రల్ జైల్లో కూడా ఉన్నారు.. అయితే 2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే విజయమ్మను జేసీ ప్రభాకర్ రెడ్డి కలవడం వెనుక అసలు కారణం ఏమిటా అని చర్చ చాలా వైరల్ గా మారుతోంది.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. జెసి ప్రభాకర్ రెడ్డి ప్రముఖ హాస్పిటల్ చికిత్స పొందడానికి వెళ్ళినప్పుడు.. అక్కడ విజయమ్మ గారినీ వెయిటింగ్ హాల్లో చూసి పలకరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె ఆరోగ్యం గురించి అడిగి మరీ తెలుసుకున్నట్లు తెలుస్తోంది. కానీ వీటిని కొన్ని మీడియా సంస్థలు కూడా తప్పుగానే హల్చల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో విజయం మాతో జెసి ప్రభాకర్ రెడ్డి భేటీ వెనుక అసలు ఉన్న నిజం ఏంటనే విషయం చెబుతే తప్ప మరెవరికి తెలియదని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఈ న్యూస్ అయితే వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: