ఛీ ఛీ! ఎంత నీచం? మటన్ పేరుతో కుక్క మాంసం రవాణా?

Purushottham Vinay

రాజస్థాన్‌ రాష్ట్రం నుంచి ట్రైన్లలో కుక్కమాంసం తెచ్చి.. బెంగళూరులోని ప్రముఖ హోటల్స్కు సప్లయ్ చేస్తున్నారనే ఆరోపణలు ప్రస్తుతం బాగా చర్చనీయాంశంగా మారాయి. దాంతో.. బెంగళూరు కుక్క మాంసం ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం స్పందించడం జరిగింది. ప్రభుత్వం వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో కర్నాటక ఫుడ్ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్ అథారిటీ అధికారులు.. బెంగళూరు రైల్వేస్టేషన్‌లోని పార్శిల్‌ విభాగంలో తనిఖీలు నిర్వహించి పెద్దయెత్తున మాంసాన్ని సీజ్‌ చేయడం జరిగింది. అనుమానాస్పద మాంసం శాంపిల్స్‌ను ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌కు పంపించారు.నిజానికి బెంగళూరులోని ప్రముఖ హోటల్స్కు సప్లయ్ చేసేందుకు రాజస్థాన్ నుంచి మటన్‌ తెప్పిస్తుంటారు కొంతమంది మాంసం వ్యాపారులు. ఈ క్రమంలోనే.. జైపూర్- మైసూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో అబ్దుల్ రజాక్ అనే మాంసం వ్యాపారి భారీగా మటన్‌ తీసుకురాగా కుక్కమాంసం ఆరోపణలతో అధికారులు దాన్ని సీజ్ చేయడం జరిగింది. అయితే.. అది మటనా?.. కుక్క మాంసమా? అనేది మాత్రం క్లారిటీ లేకుండా సోషల్ మీడియాలో ఈ వ్యవహారం బాగా సంచలనం సృష్టించింది.అయితే ఇదిలా వుంటే.. బెంగళూరు సిటీలోని మెజారిటీ మటన్ షాపుల్లో ప్రస్తుతం కిలో మటన్ ఏకంగా 700 రూపాయలపైనే పలుకుతోంది. కానీ.. ట్రైన్లో దొరికిన మాంసం బాక్సుల వ్యాపారి అబ్దుల్ రజాక్తో పాటు మరికొంతమంది మాత్రం కిలో మటన్ను కేవలం 400 రూపాయలకే అమ్ముతుండడం అనుమానాలకు తావిచ్చింది. 


మటన్ పేరుతో అబ్దుల్ రజాక్ కుక్క మాంసం అమ్ముతున్నారని బెంగళూరులోని పలువురు మాంసం వ్యాపారులు ఆరోపించడం అనేది ఈ వివాదానికి కారణమైంది.ఇక కొంత మంది వ్యాపారులు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు బాధితుడు అబ్దుల్‌ రజాక్‌. కొంత మంది కావాలనే వదంతులు సృష్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కావాలంటే చూసుకోండి.. అంటూ సీజ్‌ చేసే సమయంలో పార్శిల్‌ బాక్సుల్లోని మటన్‌ను తీసి చూపించే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక మటన్ అమ్మకానికి సంబంధించి లైసెన్స్ ని కూడా తీసుకున్నానని, గుట్టుచప్పుడు వ్యాపారం చేయడం లేదని స్పష్టం చేశాడు వ్యాపారి అబ్దుల్ రజాక్. ఏదేమైనా కానీ ఎవరి వర్షన్‌ ఎలా ఉన్నా కానీ కుక్కమాంసం ఆరోపణలతో బెంగళూరు హోటల్స్‌లో మటన్‌ తినేవాళ్లలో, తిన్న వాళ్లలో టెన్షన్‌ అనేది నెలకొంది. ఇక ఈ నేపథ్యంలో..ఆహార భద్రతా కమిషనరేట్ అధికారులు కూడా ఫైనల్ అది మేక మాంసం అని నిర్ధారించడంతో ఈ వివాదం సద్దుమణిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: