జగన్ చేస్తే ఒప్పు ..బాబు చేస్తే తప్పా.. సాయిరెడ్డి సారు ఏంటి మీ మాటలు తీరు.!

Pandrala Sravanthi
ఏపీ రాష్ట్రంలో రాజకీయాలు ఎక్కువగా కుల ప్రాతిపదికనే నడుస్తూ ఉంటాయి. రెడ్లు, రావులు, చౌదరీలు మధ్య ప్రధానమైన పోటీ ఉంటుంది. అని ఈ 2024 ఎలక్షన్స్ లో మాత్రం కాస్త డిఫరెన్స్ వచ్చిందని చెప్పవచ్చు. చాలామంది రెడ్లు కూడా చంద్రబాబుకు సపోర్ట్ చేశారు. ఎంత సపోర్ట్ చేసిన  కుల వివక్ష అనేది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తూ ఉంటుంది. జగన్ పార్టీ గెలిస్తే అన్ని శాఖల్లో నామినేటెడ్ పోస్టుల్లో రెడ్డి నాయకులు వస్తారు. కలెక్టర్ల నుంచి మొదలు వివిధ శాఖల అధికారులు కూడా రెడ్డిలే ఉంటారు. అలా జగన్మోహన్ రెడ్డిపై అప్పటికే రెడ్డి ప్రభుత్వం అంటూ ఒక అలిగేషన్ కూడా వచ్చింది. అయితే జగన్ ప్రభుత్వం ఓడిపోయి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. 


చాలావరకు చంద్రబాబుకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులను వివిధ నామినేటెడ్ పోస్టుల్లో ఎంపిక చేస్తున్నారు. అయితే తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈవోలుగా చౌదరికి సంబంధించిన వారిని పెట్టారని మాజీ ఎంపీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి అన్నారు.  వారి కులం  వారికే పెద్ద పీట వేస్తున్నారని ఆరోపించారు. ఈ విధంగా విజయసాయిరెడ్డి మాట్లాడడం చాలా ఆశ్చర్యం గురిచేస్తుంది. ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, టిటిడి ఈవోలుగా జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి ఇలా వారి కులానికి సంబంధించిన వ్యక్తులే తిరుమల తిరుపతి దేవస్థానంపై అజమయిషి చలాయించారు.


వెంకటేశ్వర యూనివర్సిటీ వీసీలు కూడా రాజారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పద్మావతి యూనివర్సిటీ వీసీలు జమున రెడ్డి, వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వీసీలు పద్మనాభ రెడ్డి, సుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,  ఇలా ఏ పదవిలో అయినా రెడ్డిలని నియమించుకున్నటువంటి జగన్ పార్టీకి టిడిపిని విమర్శించే హక్కు లేదు.  ఈ విధంగా చంద్రబాబు చేస్తే తప్పు జగన్మోహన్ రెడ్డి చేస్తే ఒప్పు అనే విధంగా విజయసాయిరెడ్డి మాట్లాడడం అందరిని ఓకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: