ఏపీ: మరోసారి కాపుల రిజర్వేషన్ మొదలు.. జోగయ్య హాట్ కామెంట్స్..!

Divya
కాపు సంక్షేమ అధ్యక్షుడు దాదాపు 80 ఏళ్లు పైబడినప్పటికి.. కాపు సామాజిక వర్గం కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు హరి రామ జోగయ్య .మళ్ళీ కాపుల ఉద్యమం పైన మళ్లీ రచ్చ మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది.. తాజాగా ఆయన ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఒక లేఖ కూడా రాసినట్లు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత 50 రోజులైనప్పటికీ కూడా కాపుల రిజర్వేషన్ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదనే విజయాన్ని హరి రామ జోగయ్య తెలియజేశారు.

కాపులకు విద్య ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలనే విధంగా డిమాండ్ ఉన్నప్పటికీ వాటిని నెరవేర్చ లేదంటు జోగయ్య తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి కేంద్రం ఇచ్చిన 10% రిజర్వేషన్లు కూడా 5 శాతం కాపులకు ఇస్తామంటూ చంద్రబాబు గతంలో నిర్ణయించారు. దీనిని కేంద్రం కూడా ఆమోదించిందో లేదో ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.. ఇప్పటివరకు దీనిపైన వైసీపీ సర్కారు ఎలాంటి చర్యలు కూడా చేపట్టలేదు మరి ఇప్పుడైనా చేపడతారో లేదో అంటూ జోగయ్య నిలదీయడం జరిగింది.

ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే ఉన్నదని కాపులకు న్యాయం చేయాలని కూడా జోగయ్య డిమాండ్ చేయడం జరిగింది.. కాపు రిజర్వేషన్ల పైన తాము ఇప్పటికే న్యాయపోరాటం చేస్తున్నామంటూ వీటిపైన కౌంటర్ వేసిన గత వైసిపి ప్రభుత్వం కౌంటర్ ను వెనక్కి తీసుకోవాలని కాపుల రిజర్వేషన్లలో న్యాయం చేయాలంటూ తెలియజేశారు. లేకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాలు కూడా తప్పవంటూ పరోక్షంగా జోగయ్య హెచ్చరించారు. గతంలో జోగయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కూడా టార్గెట్ చేశారు జనసేన టిడిపి తో కలిసి కాపులను తాకట్టు పెట్టారంటూ తెలిపారు. ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఎన్ని సీట్లు ఇస్తారు ఎన్ని మంత్రి పదవులు ఇస్తారో చెప్పాలి అంటూ జోగయ్య తెలియజేశారు.అయితే మళ్లీ గ్యాప్ ఇచ్చి ఇలాంటి నినాదాలు చేయడం మరొకసారి రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: