ఏపీ: ప్రభుత్వ పథకాల పేరు మార్పు.. కొత్త పేర్లు ఇవే..!

Divya
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వైసీపీలో అమలు చేసినటువంటి కొన్ని పథకాలను పేర్లు మార్చుతూ ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది.. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టించిందని ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. చంద్రబాబు నేతృత్వంలోనే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మళ్లీ పునరావృత్తి అవుతుంది అంటూ లోకేష్ తెలియజేశారు. మొదట వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన పథకాలకు స్వస్తి పలికినట్లుగా తెలుస్తోంది ఇప్పుడు తాజాగా పలు రకాల పేర్లు వైరల్ గా మారుతున్నాయి.

ఈ రోజున దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా నూతన కొత్త పథకాల పేర్లను సైతం నారా లోకేష్ తెలియజేశారు.
1). అమ్మ ఒడి-తల్లికి వందనం
2). జగనన్న విద్యా కానుక-సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర.
3). జగనన్న గోరుముద్ద-డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం.
4). మనబడి నాడు నేడు-మనబడి -మన భవిష్యత్తు
5). స్వేచ్ఛ-బాలికా రక్ష.
6). జగనన్న ఆణిముత్యాలు-అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం.

ఇలా కొత్త పేర్లతో పలు పథకాలను మార్చడం జరిగింది కూటమి ప్రభుత్వం. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా పథకాలకు పేరు మార్చి మరి అందరి ఖాతాలలో డబ్బులు జమ చేయబోతున్నట్లు తెలియజేస్తున్నారు. అయితే ఇటీవల అసెంబ్లీలో కూడా పథకాల విషయం పైన ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోవాలి అంటే దాదాపుగా రెండు సంవత్సరాలు పడుతుందనీ తెలియజేశారు.. పథకాలు అమలు చేయాలి అంటే మరింత ఆలస్యం అవుతుందని కూడా తెలియజేయడం జరిగింది కూటమినేతలు.. మరి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని హామీలను కూడా అమలు చేస్తామనే విధంగా తెలియజేస్తున్నారు. అయితే వైసిపి పార్టీ మాత్రం కూటమికి దీటుగా సమాధానాలను తెలియజేస్తూ ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: