జగన్ పాలనపై మోదీ సంచలన వ్యాఖ్యలు..?

FARMANULLA SHAIK
కేంద్రంలో నరేంద్రమోడీ 3.0 అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి నీతి అయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశమమైంది. ఢిల్లీలోకి రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్‌లో మోడీ అధ్యక్షతన జరుగుతున్న ఈ తొమ్మిదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో పాటు నీతి అయోగ్ వైస్ ఛైర్మన్‌, సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు.దీని ముఖ్య ఉద్దేశం 2047 నాటికి భారత్ ను వికసిత్ భారత్ గా చేయడమే.దేశం 2047 నాటికి అభివృద్ధి చెందాలంటే.. ప్రధానంగా 5 అంశాలపై ఫోకస్ పెట్టాలని ప్రధాని మోదీ కోరారు.వాటిలో రెండు అంశాలను జగన్ కోసమే ప్రస్థావించినట్లుంది.అందులో ఒకటి జగన్ పాలనపై ప్రశంసలు అలాగే ఇంకోటి జగన్ ఇచ్చిన ఉచిత పధకాలపై చేసిన తీవ్ర విమర్శలు.నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ.. 5 అంశాలపై ప్రస్తావిస్తూ.. అందులో ఒకటైన హెల్త్ కేర్ గురించి మాట్లాడుతూ.. కొన్ని రాష్ట్రాల్లో అమలుచేస్తున్న, చేసిన పథకాలను ప్రస్తావించారు. వాటిలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టును మెచ్చుకున్నారు. ఇలాంటి వాటి వల్ల ప్రజలకు వైద్యం చేరువ అవుతుందనీ, ఇలాంటి కాన్సెప్టులతో రాష్ట్రాలు ముందుకెళ్లాలని కోరారు.

ప్రధాని మోదీ నీతి ఆయోగ్ సమావేశంలో కూడా ఉచిత పథకాలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రజలకు మనీ ఇవ్వడం ద్వారా ప్రయోజనం ఉండదన్న ప్రధాని మోదీ.. దాని బదులు గుడ్ గవర్నెన్స్ ఇస్తే, అది వారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని అన్నారు. తద్వారా మనీ ఇచ్చే పథకాలనూ, ఉచిత పథకాలనూ ఆయన మరోసారి విమర్శించినట్లైంది. ఇదివరకు కూడా రెండు సందర్భాల్లో ఆయన ఉచితాలను వ్యతిరేకించారు.మొత్తంగా ఈ సమావేశం ద్వారా.. రాష్ట్రాలతో కలిసి ముందుగు సాగేందుకు సిద్ధమైనట్లు కేంద్రం తెలిపింది. ఐతే.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేలా ప్రతీ రాష్ట్రం ప్రయత్నించాలని ప్రధాని మోదీ కోరారు. ఇందుకోసం రాష్ట్రాలు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అవ్వాలన్నారు. ఈ క్రమంలో రాష్ట్రాలకు ర్యాంకులు కూడా ఇస్తామన్నారు. దేశాన్ని అభివృద్ధి చెయ్యడానికి ఇదే సరైన సమయం అన్న మోదీ.. ఇందుకోసం రాష్ట్రాలు కలిసి రావాలన్నారు. కాన్ఫిడెన్స్, ఎనర్జీ, కాంపెటెన్స్‌తో దూసుకెళ్లాలన్నారు. 2047 నాటికి దేశంలో వృద్ధుల సంఖ్య పెరుగుతుందనీ, అందుకు అనుగుణంగా రాష్ట్రాలు ఇప్పటి నుంచే ప్లాన్స్ వేసుకోవాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: