ఓట్ల లెక్కల్లో భారీ గోల్‌మాల్‌.. అందుకే జగన్‌ ఓడారా?

Chakravarthi Kalyan
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాయి. టగ్ ఆఫ్ వార్ గా నడిచిన ఎన్నికల ప్రచారం.. చివరకు ఫలితాల దగ్గరికి వచ్చే సరికి ఏకపక్షంగా ప్రజలు  తమ తీర్పును ఇచ్చారు. ఏకంగా కూటమికి 164 సీట్లు అప్పజెప్పారు. ఇదే సమయంలో వైసీపీని 151 సీట్ల నుంచి 11 కి పరిమితం చేశారు. 99 శాతం ఎన్నికల మ్యానిఫెస్టోని అమలు చేసినా ఓటమి పాలవడం ఏంటని వైసీపీ నాయకులు సందేహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్ కూడా అన్ని కుటుంబాలకు మంచి చేసినా.. ఆ అక్క చెల్లెమ్మ ఓట్లు, ఆప్యాయత, అనురాగాలు ఏం అయ్యాయో తెలియదని చెప్పారు. ఏదో జరిగింది కానీ ఆధారాలు లేవు అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు.

ఇప్పుడు తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. లోక్ సభ ఎన్నికలు, ఓట్ల లెక్కింపు సమయంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ఓట్ ఫర్ డెమొక్రసీ సంస్థ నివేదిక ఆరోపించింది.  పోలైన ఓట్లు మొదట ప్రకటించిన దానికంటే చివరగా వెల్లడించే సమయానికి అనూహ్యంగా దేశ వ్యాప్తంగా 4,65,46,885 పెరిగాయని, ఏడు దశల ఈ పోలింగ్ లో పెరుగుదల 3.2 నుంచి 6.32 శాతం వరకు ఉందని పేర్కొంది.

దీనివల్ల బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 79 స్థానాల్లో లబ్ధి కలిగింది అని తెలిపింది. ఇందులో ఒడిశాలో 18, మహారాష్ట్రలో 10, పశ్చిమ బెంగాల్ లో 10 స్థానాలు, ఏపీలో ఏడు ఎంపీ సీట్లు ఉన్నాయని తెలిపింది. ఓట్ల పరంగా చూసుకుంటే ఒడిశాలో 42 లక్షలు, మహారాష్ట్రలో 52.6, బెంగాల్ లో 36, ఏపీలో 49, కర్ణాటకలో 22, తెలంగాణలో 14, రాజస్థాన్ లో 22.5, బిహార్ లో 11.6 లక్షల ఓట్లతో పాటు ఇంకా పలు రాష్ట్రాల్లో ముందు చెప్పిన దానికంటే లెక్కలు ఎక్కువగా ఉన్నాయి.  ఏపీలో పోలైన ఓట్ల కంటే 12శాతం ఓట్లు అధికంగా కౌంట్ చేశారని దాని కారణంగానే తమ పార్టీ ఓడిపోయిందని వైసీపీ ఆరోపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: