బాస్ ఈజ్ బ్యాక్.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతానంటున్న కేసీఆర్.!

Pandrala Sravanthi
తెలంగాణ రాష్ట్రంలో తాజాగా రాష్ట్ర బడ్జెట్ పెట్టిన సంగతి మనకు తెలిసిందే.రాష్ట్ర బడ్జెట్ ని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఆయన ఏ ఏ పథకాలకు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నాము అనేది వివరంగా తెలిపారు. అయితే ఈ బడ్జెట్ పై బి ఆర్ ఎస్ రేణులు  అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయాక మొదటిసారి అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు కేసీఆర్.ఇక ఈయన అసెంబ్లీకి వస్తారా రారా అనే చర్చ జరిగినప్పటికీ ఎట్టకేలకు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.ఇక అసెంబ్లీలోకి మాజీ సీఎం వస్తే కథ వేరేలా ఉంటుంది. రెండుసార్లు తెలంగాణను పాలించిన ముఖ్యమంత్రి కెసిఆర్ తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై నిప్పులు చెరిగారు.

 అసలు ఈ బడ్జెట్ వల్ల దళితులకు, మహిళలకు ఎలాంటి ఉపయోగం లేదని, వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందేమీ లేదని మాట్లాడారు.అంతేకాదు బడ్జెట్లో దళిత బందు ప్రస్తావనే తీసుకు రాలేదని, దళితులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.ఇక ఈ బడ్జెట్ ని బట్టి విక్రమార్క ఒక రాజకీయ ప్రసంగంలా స్టోరీలా చెప్పారు అంతేకానీ బడ్జెట్లా లేదు. ఈ బడ్జెట్లో రైతులకు ఉపయోగం ఉండే ఒక్క అంశం కూడా లేదు. ఒక్క పాలసీని కూడా ప్రకటించలేదు.అలాగే  బడ్జెట్లో ఒక్క ఇండస్ట్రీ కి సంబంధించిన పేరు కూడా చెప్పలేదు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా కూడా అంత బాగా లేదు అంటూ ప్రభుత్వం పై మండిపడ్డారు.

అలాగే ఇప్పటినుండి తగ్గేదేలే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం అంటూ కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడారు  దీంతో కేసీఆర్ మాటలు విన్న చాలా మంది బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఖుషి అవుతున్నారు. అంతేకాదు బాస్ ఈజ్ బ్యాక్..కేసీఆర్ ఎంట్రీ ఇచ్చారంటే ఇక అంతే సంగతులు అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ఇక కేసీఆర్ మాటలు చూస్తుంటే ఇప్పటినుండి  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో అన్ని అమలు చేయలేకపోయారు. ఇక ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు పూర్తవుతుంది. దాంతో కేసీఆర్ కాంగ్రెస్ ఇచ్చిన హామీల ను ఎప్పటికప్పుడు నిలదీసే పనిలో పడ్డారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: