పధకాల విషయంలో ఎరక్కపోయి ఇరుక్కున్న కూటమి సర్కారు?
గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని తీసుకుంటే... వీరు కేవలం 15 రోజుల్లోనే నవరత్నాల పథకాల హామీల విషయంలో జాప్యం కాకుండా చూసుకున్నారు. అంతేకాకుండా త్వరితగతిన పథకాల అమలకు శ్రీకారం చుట్టారు. ఏపీ ప్రజలు ఇప్పుడు ఇదే అంశాన్ని బ్యారేజీ వేసుకొని పరిశీలిస్తున్నారు. దానికి తోడు తల్లికి వందనం పథకానికి దాదాపు సంవత్సరం సమయం కావాల్సి ఉంటుందని శాసనమండలిలో మంత్రి నారా లోకేష్ చెప్పుకు రావడం కోసమెరుపు. ఎన్నికల ముందు ఇటువంటి నిబంధనల విషయాలు చంద్రబాబు ఎక్కడా ప్రస్తావించిన పాపాన పోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నారా లోకేష్ అటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు అని రాష్ట్ర ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.
ఇక ఎన్నికలకు ముందే ఏపీ ఖజానా ఖాళీగా ఉన్న సంగతి బాబుకు తెలిసిందే. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో బాబు హామీల విషయంలో ఎందుకు తొందర పడ్డాడు అనే విమర్శలు రానే వచ్చాయి. కానీ బాబు ప్రజలతో చేయవలసిన రాజకీయం బాగానే చేశాడు... ఈ క్రమంలో ఆంధ్ర ప్రజలు బాబుని గద్దె పైన కూర్చోబెట్టారు... గ్రామీణ వర్గం ఓటు బ్యాంకు కూడా కూటమికి బాగా సహకరించింది. దాంతోనే అంతటి ఘన విజయం సాధించగలిగింది. అయితే ఇప్పుడు అంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రజలకు పథకాల విషయంలో బాబు వీపు చూపిస్తే... రాబోయే రోజుల్లో డిపాజిట్లు గల్లంతయ్య అవకాశం ఉందని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.