వైసీపీ వికెట్లు టపటపా: వీడుతున్న నేతలు.. ఆ ప్లానింగ్ వర్కౌట్ అవుతుందా..?

Divya
•ఓటమిపాలైన వైసీపీ.. ఒక్కొక్కరుగా వీడుతున్న నేతలు
•మద్యస్థ ఎన్నికలు జరిగితే వీడినవారు మళ్లీ వస్తారా
•వైసీపీ నేతల ప్లానింగ్ ఏంటి..?

(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)

సాధారణంగా ఒక పార్టీ ఓడిపోయింది అంటే ఆ పార్టీని వీడే వారు చాలామంది ఉంటారు. అయితే గెలిచిన పార్టీకే ఎప్పుడైనా సరే మద్దతు లభిస్తుంది అని ఇప్పటికే చాలా సంవత్సరాలుగా నేతలు నిరూపిస్తున్నారు కూడా.. ఈ క్రమంలోనే తనను తన వాళ్లను నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డికి కూడా ఇప్పుడు అదే జరిగింది. 2019 ఎన్నికలలో వైసిపి ప్రభుత్వం ఏకంగా 151 సీట్లు కైవసం చేసుకొని రికార్డు సృష్టించింది. ఈ విజయం వెనుక జగన్మోహన్ రెడ్డి తో పాటు ఆయన నమ్ముకున్న ఎంతోమంది నేతల కష్టం కూడా ఉంది. అయితే ఐదు సంవత్సరాలు సంక్షేమ పథకాలు అంటూ జగన్మోహన్ రెడ్డి అట్టడుగు బలహీన వర్గాల వారిని ఫోకస్ చేశారు.  కానీ తమ కోసం తమ పార్టీ కోసం పనిచేసిన నేతలను పట్టించుకోవడంలేదని అపవాదం కూడా ఆయన మోయడం జరిగింది. ఇవే కాదు ఎన్నో అంశాలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిలిచాయి.  అందులో భాగంగానే ఈసారి కూటమిని ఆయన ఓడించలేకపోయారు. 175 స్థానాలలో పోటీ చేస్తే కేవలం 11 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

దీనికి కూడా కారణం లేకపోలేదు. టికెట్ ఆశించిన చాలామంది నేతలకు టికెట్ ఇవ్వకపోవడంతో భంగపడ్డారు. ఉదాహరణకు గుమ్మనూరు జయరాం లాంటి నేతలు టికెట్ ఆశిస్తే టికెట్ ఇవ్వకపోవడంతో భంగపడ్డారు. దీంతో గుంతకల్ నుంచి టిడిపి తరఫున పోటీ చేసి ఆయన విజయం సాధించారు.పార్టీ ఓడిన తర్వాత ఎన్నో విషయాలలో భంగపడ్డ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడడం జరిగింది. అయితే నేతలు ఇలా వీడిపోవడం వెనుక పక్కా ప్లానింగ్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఎందుకంటే మొన్న విజయసాయిరెడ్డి మధ్యస్థ ఎన్నికలు జరిగినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అని ఆయన చెప్పారు. అందుకే ప్రస్తుతం ఆదాయం లేకుండా పోయిన పార్టీలో ఉండకుండా ఇతర పార్టీలకు వెళ్లి అక్కడ బాగా సంపాదించి,  ఒకవేళ మద్యస్థ ఎన్నికలు జరిగితే మళ్లీ తమ పార్టీలోకి వచ్చి తమ పార్టీని నిలబెట్టుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది నేతలు అంటూ ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి.
జగన్ కు ఎప్పటికీ అండగా ఉంటామని చెప్పిన నేతలు వీడిపోయారు. అందుకే ఏదైనా ప్లానింగ్ చేస్తున్నారా అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఒకవేళ ఇదే గనుక నిజమైతే వైసీపీ నేతలు ప్లానింగ్ కి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. మరి జగన్ నమ్ముకున్న నేతలు జగన్ను వమ్ము చేయకుండా ఆర్థికంగా బలపడి మళ్లీ జగన్కు సహాయం చేస్తారా?  లేక జగన్ చేసిన తప్పిదాలను మనసులో పెట్టుకొని దూరం  అవుతారా అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: