పథకాల ప్రశ్నలతో ఫుట్ బాల్ ఆడుకోవాలనుకుంటున్న జగన్.. అసెంబ్లీలో ఛాన్స్ దక్కుతుందా?
ప్రధానంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు నెలకు 1500 రూపాయలు, నిరుద్యోగులకు 3000 రూపాయలు, 50 ఏళ్లకే 4000 రూపాయల పింఛన్ లాంటి హామీలు ఎప్పటినుంచి అమలవుతాయో క్లారిటీ లేదు. ఇప్పటికే జగన్ వినుకొండ పర్యటన సమయంలో ఈ పథకాల గురించి ప్రశ్నలు గుప్పించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రజలు సైతం పథకాల అమలు గురించి స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు.
జగన్ ను మించి సంక్షేమ పథకాలను అమలు చేస్తానని చంద్రబాబు ప్రకటంచడం కూటమి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమని చాలామంది భావిస్తారు. మరి చంద్రబాబు ఇచ్చిన హామీలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తారనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం కొసమెరుపు. అసెంబ్లీ సమావేశాలు సాఫీగా సాగుతాయా లేదా అనే ప్రశ్న కూడా వ్యక్తమవుతోంది.
వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లలో జూనియర్లు ఎక్కువగా ఉండటంతో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జగన్ ఒక్కడే పార్టీని ఎంతవరకు నిలబెట్టుకుంటారనే చర్చ జరుగుతోంది. టీడీపీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తే వైసీపీ ఖాళీ అయ్యే అవకాశాలు సైతం ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. పథకాల ప్రశ్నలు ఎదురైతే కూటమి వైపు నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందో చూడాలి. వైసీపీ పుంజుకుంటే మాత్రమే రాష్ట్రంలో పార్టీకి భవిష్యత్తు ఉంటుందని చెప్పవచ్చు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు జగన్ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.