రుణమాఫీ విషయంలో ఊరించి ఉసూరుమనిపించిన జగన్.. ఓటమికి ఈ స్కీమ్ కారణమా?

Reddy P Rajasekhar
ఏపీ సీఎం వైఎస్ జగన్ పదుల సంఖ్యలో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాల మాఫీ దిశగా అడుగులు వేసిన జగన్ పై 2024 ఎన్నికల ముందు రుణమాఫీ హామీని ప్రకటించాలని అయనపై విపరీతమైన ఒత్తిడి వచ్చింది. బహిరంగ సభల్లో జగన్ అభిమానులు సైతం రుణమాఫీ స్కీమ్ ను అమలు చేయాలని సూచించడం జరిగింది.
 
కనీసం లక్ష రూపాయల రుణమాఫీని ప్రకటించినా వైసీపీ సునాయాసంగా విజయం సాధిస్తుందని చాలామంది జగన్ కు వెల్లడించినా రుణమాఫీ విషయంలో జగన్ ఊరించి ఉసూరుమనిపించారు. జగన్ మొదట రుణమాఫీ అమలు చేయనని క్లారిటీ ఇచ్చినా బాగుండేదని చాలామంది ఫీలవుతారు. వైసీపీ దారుణ పరాజయానికి రుణమాఫీ కూడా కారణమని చాలామంది రైతులు భావిస్తున్నారు.
 
ఎన్నో పథకాలను చెప్పిన విధంగా అమలు చేసిన జగన్ రుణమాఫీని సైతం హామీ ఇచ్చి ఉంటే ఏదో ఒక విధంగా నెరవేర్చేవారని మరి కొందరు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో కూటమికి ధీటైన మేనిఫెస్టో లేకపోవడం కూడా ఓటమికి కారణమని చాలామంది భావిస్తారు. జగన్ కు సైతం ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇందుకు సంబంధించి కీలక సమాచారం అందినట్టు తెలుస్తోంది.
 
2029 ఎన్నికల సమయానికి అయిన జగన్ రుణమాఫీని ప్రకటించేలా మేనిఫెస్టోను సిద్ధం చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2029 ఎన్నికల ఫలితాలు వైసీపీ భవిష్యత్తును నిర్దేశించే ఫలితాలు కావడంతో జగన్ అడుగులు ఎటువైపు పడతాయో చూడాలి. జగన్ వైసీపీకి పూర్వ వైభవం తీసుకొనిరావాలంటే సరైన ప్రణాళికలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సరైన సలహాదారులతో జగన్ ముందుకెళ్తే పార్టీకి కచ్చితంగా మేలు జరుగుతుందని చెప్పవచ్చు. వైసీపీ భవిష్యత్తు జగన్ చేతిలో మాత్రమే ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కూటమి హామీల అమలు సైతం వైసీపీ భవిష్యత్తును నిర్దేశించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: