హైదరాబాద్ వాసులకు గుదిబండ లాంటి న్యూస్.. మళ్లీ పెరిగిన టమాట ధర?

praveen
ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయ్. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ వరద నీరు నిండిపోయి జనావాసాలు అస్తవ్యస్తంగా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. దీంతో ఎంతో మంది సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి సమయంలో సామాన్యులు అందరిని మరింత బెంబేలెత్తించే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. ఈ విషయం గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ లో మునిగిపోతున్నారు అని చెప్పాలి. ఆ వార్త ఏంటో కాదు టమాటా ధర పెరుగుదల గురించి.

 మొన్నటికి మొన్న ఒక్కసారిగా టమాటా దిగుబడి తగ్గిపోవడంతో మార్కెట్లో డిమాండ్ కి సరఫరాకి మధ్య అసమతుల్యత ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా టమాటా ధర పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా టమాటా ధర ₹100 వరకు పెరిగిపోయింది. దీంతో సామాన్య ప్రజలు అందరూ కూడా ఎంతగానో బెంబేలెత్తి పోయారు. ఇక టమాటా లేకుండానే వంటలు చేసుకునేందుకు కూడా సిద్ధమైపోయారు. అయితే ఇక ఇప్పుడు సరఫరా డిమాండ్ కు తగినట్లుగా రావడంతో గత కొన్ని రోజుల నుంచి కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ సామాన్యులకు టమాటా ధర ఉపశమనం కలిగించింది. అయితే ఇక ఇప్పుడు మళ్ళీ భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ టమాటా పంటలు దెబ్బతింటున్నాయ్. దీంతో డిమాండ్కు అనుగుణంగా మార్కెట్లోకి టమాట సరఫరా రావడం లేదు.

 ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో మళ్లీ టమాటా ధరలు ఆకాశాన్ని అంట పోతున్నాయి అన్నది తెలుస్తుంది. భారీ వర్షాల కారణంగా భారీగా పంట నష్టం జరిగిన నేపథ్యంలో మార్కెట్లోకి టమాటాలు ఎక్కువగా సరఫరా కావట్లేదు. ఈ కారణంతోనే ప్రస్తుతం టమాటా ధరలు భారీగా పెరిగాయి అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో టమాట ద్వారా 70 నుంచి 80 పలుకుతూ ఉండగా.. రానున్న దోమతుల్లో సెంచరీ కొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని అంటున్నారు ఎంతోమంది నిపుణులు. ఏకంగా కారణంగా సరఫరా ఇలాగే తగ్గితే ఏకంగా 100 రూపాయలకు పైగానే కిలో టమాట ధర పలికే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే గతంలో కూడా ఇలా టమాట ఏకంగా కిలో 200 రూపాయలకు పెరిగి సామాన్యులను బెంబేలెత్తించింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: