రఘురామ టైం వచ్చిందమ్మా..ఆ అధికారులు జైలుకేనా.?

Pandrala Sravanthi
 రఘురామకృష్ణంరాజు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఫేమస్ పొలిటీషియన్. ఒకప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక లీడర్ గా ఉండేవారు. 2019 ఎలక్షన్స్ లో వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా గెలుపొందారు. తర్వాత జగన్ తో విభేదాల కారణంగా పార్టీకి దూరమైపోయారు. ఇక అప్పటినుంచి వైసిపిపై విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే ఈ విషయంపై సీరియస్ అయినటువంటి వైసీపీ ఆయన రాజద్రోహానికి పాల్పడ్డారని కేసు పెట్టి  2021లో సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. అయితే 2021 మే 14 రాత్రి 11:30 నిమిషాలకు  ఆయనను గుంటూరులోని సీబీసీఐడీ ఆఫీసులో విపరీతంగా కొట్టి చిత్రహింసలు పెట్టారని రఘురామకృష్ణం రాజు ఆరోపించారు.


అంతేకాకుండా మీడియా ముందుకు వచ్చి తనకు తగిలిన గాయాలన్నింటిని చూపించారు.
 కట్ చేస్తే.. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో ఉండి నుంచి రఘురామ కృష్ణంరాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన  2021 లో తనను అక్రమంగా అరెస్టు చేసి హింసించి హత్యాయత్నం చేశారంటూ  జూలై 11న  కేసు పెట్టారు. అప్పటి సీబీసిఐడి సునీల్ కుమార్, ఇంటిలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, సిబి సిఐడి అడిషనల్ ఎస్పీ ఆర్ విజయపాల్, మాజీ సీఎం జగన్, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ప్రభావతిలపై కేసు నమోదు చేశారు.


 2021లోన అరెస్టు చేసి  గుండె ఆపరేషన్ అయిన నాకు కనీసం మందులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని,ఇదంతా జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతోనే జరిగిందని  అంతేకాకుండా సునీల్ కుమార్, సీతారామాంజనేయులు సహా మరి కొంత మంది అధికారులు నన్ను హత్య చేసేందుకు ప్రయత్నించారని,  అలాగే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ప్రభావతి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందని, రఘురామకృష్ణంరాజు ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విధంగా జగన్ తో పాటు పలువురు   అధికారులపై ఆయన ఫిర్యాదు చేయడంతో ఈ కేసు సంచలనంగా మారింది.  ఒకవేళ ఇవన్నీ నిజరూపం దాల్చితే మాత్రం తప్పకుండా వీరందరికీ పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం కనిపిస్తోంది. మరి చూడాలి ఈ కేసును  పోలీసులు ఏ విధంగా దర్యాప్తు చేస్తారు..ఎలా ముందుకు వెళ్తారు..అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: