8 లక్షల ఎకరాల రైతుల కల సుజల స్రవంతి.. బాబు పాలనలో రైతుల కష్టాలు తీరతాయా?
భూసేకరణ ప్రక్రియలోనూ ఆలస్యం జరుగుతుండటంతో పాటు ఈ ప్రాజెక్ట్ కు గోదావరి నీటిని తీసుకొనిరావాల్సి ఉండగా పోలవరం ఎడమ కాలువ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోవడం గమనార్హం. ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాలకు గోదావరి వరద జలాలను తీసుకెళ్లే విధంగా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. ఈ ప్రాజెక్ట్ పూర్తైతే 30 లక్షల మందికి తాగునీరు, 8 ఎకరాలకు సాగునీరు అందనుంది.
జగన్ పాలనలో ఈ ప్రాజెక్ట్ పనులు ఆశించిన స్థాయిలో జరగని నేపథ్యంలో బాబు పాలనలో రైతుల కష్టాలు తీరతాయా? అనే చర్చ జరుగుతుండటం గమనార్హం. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కోసం 645 కోట్ల కేటాయింపులు చూపినా ఖర్చు చేసింది మాత్రం కేవలం 18 కోట్ల 64 లక్ష రూపాయలు మాత్రమే కావడం కొసమెరుపు. భూ సమీకరణ జరగకపోతే పనులు ఎలా చేస్తామని గుత్తేదారులు చెబుతున్నారని భోగట్టా.
అయితే చంద్రబాబు సర్కార్ మాత్రం ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. ఈ ప్రాజెక్ట్ ను శరవేగంగా పూర్తి చేసి అనకాపల్లి, విశాఖ జిల్లాలకు సాగు, తాగునీరు అందించాలని కసరత్తు చేస్తుండటం గమనార్హం. గత ఐదేళ్లుగా పోలవరం ఎడమ కాలువ పనులు నిలిచిపోగా ఆ పనులను వేగంగా పూర్తి చేయాలని కూటమి నేతలు భావిస్తున్న నేపథ్యంలో సుజల స్రవంతి పనులు ఎప్పటికి పూర్తవుతాయో చూడాలి. 8 లక్షల ఎకరాల రైతుల కల ఈ ప్రాజెక్ట్ ను నిజం చేయనుంది.