టీడీపీ ఎమెల్యేలు అప్పుడే దందాలు మొదలెట్టేశారా.. ఆ ఎమ్మెల్యే టార్గెట్లు ఫిక్స్ చేశారా..!
ఈ క్రమంలోనే దక్షిణ కోస్తా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత.. ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి.. అధికారులకు నెలకు 40 నుంచి 50 లక్షలు వసూళ్లు చేయాలని టార్గెట్లు పెడుతున్నట్టు ప్రచారం గట్టిగా జరుగుతోంది. అంతా ఆ ఎమ్మెల్యే గెలిచి నెల రోజులు అయిందో.. లేదో.. అప్పుడే ఈ పుకారు నియోజకవర్గం అంత గట్టిగా వ్యాపించేసింది. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఎమ్మెల్యే టార్గెట్లు పెట్టేస్తున్నాడు అంట కదా.. ఇప్పుడే ఇలా ఉంటే ఈ ఐదేళ్లు ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో ? పరిస్థితి.. అని గుసగుసలాడుకుంటున్నారు. ఇటు రాజకీయ వర్గాలు అటు అధికార వర్గాలతో పాటు నియోజకవర్గ కేంద్రంలో సామాన్య జనాల్లోనూ ఇదే చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోంది.
ఆ నియోజకవర్గంలో అనేక రకాల వ్యాపారాలతో పాటు ఇసుక వ్యాపారం బాగా ప్రసిద్ధి. ఈ క్రమంలోనే సదురు ఎమ్మెల్యే కన్ను ఇసుక వ్యాపారంతో పాటు.. ఇతర వ్యాపారాలు అలాగే ఆ నియోజకవర్గంలో పేరన్న ఇల్లీగల్ వ్యాపారాలపై కూడా పడినట్టు తెలుస్తోంది. అవన్నీ సక్రమంగా జరగాలంటే నెల.. నెలా.. తన మామూలు తనకు ఇవ్వాల్సిందే అని కండీషన్లు పెడుతున్నట్టు తెలుస్తోంది. నెలకు 40 నుంచి 50 లక్షలు ఆయన టార్గెట్గా పెట్టినట్టు కూడా గట్టిగా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా దీనిపై పార్టీ అధిష్టానం దృష్టి పెడితే మంచిది. లేకపోతే ఇది ప్రతిపక్షాలకు అస్త్రంగా మారి అంతిమంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనటంలో సందేహం లేదు.