శాంతి: నా బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డి కాదు ఆయనే.?

Pandrala Sravanthi
 గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గర్భం దాల్చడంపై అనేక  ఆరోపణలు వస్తున్నాయి. తన భర్త విదేశాల్లో ఉండగానే శాంతి గర్భం దాల్చిందని దీనికి ప్రధాన కారకుడు విజయసాయిరెడ్డి అంటూ తన భర్త ఆరోపణలు చేశాడు. దీంతో మీడియా వేదికగా అనేక కథనాలు శాంతిపై వచ్చాయి. దీనిపై స్పందించినటువంటి శాంతి  భర్త మదన్మోహన్పై సంచలనమైన ఆరోపణలు చేసింది. తాను విదేశాల్లో ఉన్న టైంలోనే ఏపీలో ఉన్న తన  భార్య ఎలా గర్బంధాల్చిందని ఆయన  వెల్లడిస్తూ వస్తున్నాడు. నా గర్భానికి విజయసాయి రెడ్డి అసలు కారణమే కాదని తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో శాంతి మీడియా ముందు గర్భానికి కారకులు ఎవరో చెప్పింది. 


నేను 2013లో మదన్ మోహన్ ను పెళ్లి చేసుకున్నానని, లా చదువుతున్న సమయంలోనే  మాకు వివాహమైందని తెలియజేసింది. కానీ పెళ్లయ్యాక మదన్ నన్ను చాలా హింసించాడని దీంతో  2016 సమయంలో మేమిద్దరం విడాకులు తీసుకొని వేరువేరుగా ఉంటున్నామని అన్నది. అంతేకాకుండా నా దగ్గర ఉన్న బంగారం, కారు, పిల్లల విషయంలో కూడా ఆమోదయోగ్యమైన ఒప్పందం కూడా రాసుకున్నామని తెలియజేసింది.మదన్ తో దూరమైన తర్వాత నేను సుభాష్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నానని శాంతి అన్నది. 2021 వరకు తాను విశాఖలోనే ఉన్నానని,మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నా కానీ మదన్ నన్ను వేధిస్తూ ఉన్నాడని ఆరోపణ చేసింది.


అలాగే అమెరికా నుంచి వచ్చాక పిల్లలను మదన్ మోహన్ కి చూపించానని డబ్బు కోసమే ఇలా నన్ను ఆయన అనుమానిస్తున్నారని అన్నది. నేను ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళను కాబట్టి నన్ను ఇంతమంది టార్గెట్ చేస్తున్నారు. వేరే కులం దానికి చెందిన దాన్ని అయితే ఇలా అనగలరా ఒక ట్రైబల్ అమ్మాయి ఉద్యోగాలు చేయకూడదా అంటూ, మంచి నగలు ధరించకూడదా? నేను కష్టపడి లా చదివాను అడ్వకేట్ గా కూడా ప్రాక్టీస్ చేశాను, ఒకరి సొమ్ముకు ఆశపడాల్సిన అవసరం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సాయి రెడ్డి సార్ కు నాకు ఎలాంటి పరిచయం లేదని కేవలం నా బాధ్యతలు మాత్రమే నేను నిర్వర్తించేదాన్ని అంటూ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: