RRR: జగన్ ను జైలుకు పంపేందుకు గోతులు తవ్వుతున్న రఘురామ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... వైసిపి ఓడిపోయిన తర్వాత... ఆ పార్టీలో ఉన్న నేతలను అష్ట కష్టాలు పెడుతోంది తెలుగుదేశం ప్రభుత్వం. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ... వైసిపి నేతలను టార్గెట్ చేస్తూ... కేసులు పెడుతున్నారు టిడిపి నేతలు. మొట్టమొదటిగా వైసిపి కార్యాలయాలను కూల్చేందుకు... స్కెచ్ వేసిన టిడిపి.. ఆ తర్వాత... వైసిపి నేతల అవినీతిని బయటికి తీసే ప్రయత్నం చేసింది. అనంతరం వైసిపి కార్యకర్తలు, నేతలపై దాడులకు పాల్పడేందుకు తెలుగు తమ్ముళ్లు కుట్రలు చేసినట్లు వార్తలు వచ్చాయి.

ఇక ఇప్పుడు వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న... కొడాలి నాని, జోగినేని రమేష్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లపై వరుసగా... కేసులు పెడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. గత ఐదు సంవత్సరాలలో... వీళ్ళు చేసిన.. తప్పిదాలను తవ్వి తీస్తున్నారు. అయితే.. తాజాగా వైఎస్ జగన్‌కు బిగ్ షాక్ ఇచ్చారు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు. తన కస్టోడియల్ టార్చర్‌పై ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 11న ఈమెయిల్ ద్వారా వైఎస్ జగన్‌ పై గుంటూరు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు రఘురామ కృష్ణంరాజు.

ఎమ్మెల్యే రఘురామ ఫిర్యాదుతో... జగన్‌ పై కేసులు నమోదు చేశారు. సీఎం జగన్‌, నాటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌లపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. ఏ1 సునీల్ కుమార్, ఏ2 సీతారామాంజనేయులు,ఏ 3 వైఎస్ జగన్, ఏ 4 విజయ్ పాల్, ఏ 5 డా.ప్రభావతిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. వీరందరిపై సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 508 (34) కింద కేసు నమోదు చేశారు పోలీసులు.  ఇది ఇలా ఉండగా...   2021 మే 14న రఘురామను అరెస్ట్ చేసి తీవ్రంగా గాయపరిచినట్లు ఫిర్యాదు చేశారు రఘురామకృష్ణం రాజు.  

అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి మేరకు తనను అక్రమంగా అరెస్టు చేశారని...  రఘురామరాజు తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అంతేకాదు పోలీసుల కస్టడీలో తనను హింసించారని... కాళ్లు అలాగే చేతులపై దారుణంగా కొట్టారని... రఘురామరాజు ఆరోపించారు. చంపేందుకు కూడా కుట్రలు చేశారని తెలిపారు. దీంతో పోలీసులు కూడా రంగంలోకి దిగి జగన్మోహన్ రెడ్డి తో పాటు అధికారులపై కేసులు పెట్టారు. మరి ఈ కేసు నేపథ్యంలో జగన్‌ మోహన్‌ రెడ్డిని జైలుకు పంపిస్తారా...లేదా అనేది ఇప్పుడు అందరిలోనూ సందిగ్ధత నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr

సంబంధిత వార్తలు: