బాబు నెల పాలన మురిపాలు మెరుపులు: బాబా మజాకా..గుజరాత్ ను పక్కకు నెట్టేసి ఏపీకి బీపీసీఎల్ తెస్తున్న ఘనుడు.!
- సంపద సృష్టించడంలో ఘనుడు.
- బీపీసీఎల్ రాకతో నిరుద్యోగం పరారేనా.?
చంద్రబాబు నాయుడు పాలన ఎప్పుడైనా సరే భవిష్యత్తు తరాలు గుర్తించుకునేలా పనులు చేస్తారు. ఒకప్పుడు హైదరాబాదులో ఐటీ రంగాన్ని డెవలప్ చేసింది కూడా బాబు గారే. ఆయన చలవతోనే ఈరోజు వేలాది మంది ఐటీ ఉద్యోగులు హైదరాబాదులో ఉద్యోగం చేయగలుగుతున్నారు. ఈ విధంగా భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేసే బాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముందడుగు వేస్తున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు కావస్తోంది. ఇంతలోనే ఏపీకి అమరావతి రోడ్ల నిర్మాణానికి నిధులు మరియు బీపీసీఎల్ రిఫైనరీకి భారీగా నిధులు పట్టుకొచ్చారు. దీంతో రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా 20,000 మందికి పైగా ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన రాష్ట్రంగా ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. మరి అసలు బిపిసిఎల్ అంటే ఏమిటి?దానికోసం బాబు ఎంత కష్టపడ్డారు ఆ వివరాలు చూద్దాం.
ఏపీలో నిరుద్యోగం పరార్.!
ఆంధ్రప్రదేశ్ లో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని బాబు పట్టు పట్టారు. దీనికోసం గుజరాత్ రాష్ట్రం విపరీతంగా పోటీ పడింది. నరేంద్ర మోడీతో సహా రాష్ట్రంలోని పెద్దలు కేంద్రంలోని కొంతమంది పెద్దలు కూడా పోటీపడ్డారు. అయినా వెనక్కి తగ్గని చంద్రబాబు నాయుడు లేదు మా ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోయింది ఈ ప్రాజెక్టు మాకు వస్తేనే మేము కాస్త అభివృద్ధి చెందగలుగుతామని కేంద్ర స్థాయి నాయకులతో లాబియింగ్ చేసి చివరికి మోడీని కూడా ఒప్పించి 60 వేల కోట్ల ప్రాజెక్టు బీపీసీఎల్ రిఫైనరీని ఏపీకి తీసుకువస్తున్నారు.