సూపర్ సిక్స్ తో బాబు సిక్సర్ కొడతారా.. కుంభస్థలం బద్దలు కొట్టకపోతే ఇబ్బందేగా?

Reddy P Rajasekhar
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీల ద్వారా రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొనిరావడంలో సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ తో బాబు సిక్సర్ కొడతారో లేదో చూడాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తే మాత్రమే పరిస్థితి మారే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సూపర్ సిక్స్ తో బాబు సిక్సర్ కొడతారా లేదా అనే చర్చ జరుగుతోంది.
 
కుంభస్థలం బద్దలు కొట్టకపోతే చంద్రబాబు నాయుడుకు ఇబ్బందేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సూపర్ సిక్స్ లో భాగంగా అమలు చేసిన పింఛన్ల పెంపునకు మంచి మార్కులు పడగా అదే సమయంలో ఉచిత ఇసుక విధానంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక రేట్లు ఒక్కోచోట ఒక్కో విధంగా ఉండటం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
తల్లికి వందనం స్కీమ్ ను త్వరలో అమలు చేస్తామని కూటమి నేతలు చెబుతుండగా ఈ స్కీమ్ అమలు షరతులకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. అన్నదాత సుఖీభవ స్కీమ్ నగదు ఎప్పుడు జమవుతాయా అని ఏపీ రైతులు ఎదురుచూస్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ పథకాల విధి విధానాలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.
 
ఈ స్కీమ్స్ కు అయ్యే మొత్తం లెక్క వేసి నిధులు సమకూర్చుకుని పథకాలను అమలు చేస్తే మాత్రం చంద్రబాబు పాలన విషయంలో ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేసే అవకాశాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గతంలో భారీ స్థాయిలో సంక్షేమ పథకాలను ఎప్పుడూ అమలు చేయలేదు. కూటమి ఇచ్చిన హామీలలో ఏ హామీని నిలబెట్టుకోకపోయినా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. చంద్రబాబు ప్రజల మనస్సు గెలుచుకునేలా పాలన సాగిస్తారో లేదో చూడాల్సి ఉంది.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: