జగన్ మెడకు చుట్టుకుంటున్న స్కామ్ లు.. ఏకంగా 200 కోట్లు.?

Pandrala Sravanthi
తీగ లాగితే డొంక కదిలినట్టు  ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వంలో ఎంతోమంది ఆయన అనుచరులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కిందిస్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు అనేక అక్రమాలకు పాల్పడినట్టు  తెలుస్తోంది. ఈ అక్రమాలన్నీ జగన్ కు తెలిసే చేశారా లేదంటే తెలియకుండానే చేసుకుంటూ వచ్చారా అనేది  తేలాల్సి ఉంది. జగనేమో  ఎన్నో పథకాలు ఇచ్చాను నేనే గెలుస్తానని అపోహతో, కనీసం ప్రజల్లోకి ఏం వెళ్తోంది, వారికి ఏ పథకాలు అందుతున్నాయి అనేది పట్టించుకోలేదు. కానీ జగన్ కు మాత్రం కింది స్థాయి నాయకులంతా మనం జనాల్లో ఫుల్ ఫామ్ లో ఉన్నాము. మళ్లీ మనమే గెలుస్తాం. అద్భుతమైన ఫలితాలు వస్తాయంటూ నమ్మబలికారు. తీరా చూస్తే చివరికి 11 సీట్లకు పరిమితం అయ్యాడు. 

అంటే ఈ వ్యతిరేకత చూస్తే మాత్రం  జగన్ కిందిస్థాయి వర్గం అంతా ప్రజలతో చాలా దారుణంగా బిహేవ్ చేశారని  అర్థం చేసుకోవాలి. చెరువులో నీళ్లు చెరువెనుక పడే వరకు జగన్ కు అర్థం కాలేదు. చివరికి  ఈ స్కాముల పుట్ట రోజుకొకటిగా బయటకు వస్తోంది. ఈ స్కాములన్నీ  కలిసి జగన్ మెడకే చుట్టుకునేలా ఉంది. అయితే తాజాగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి చెందినటువంటి ఒక కాంక్రీట్ సంస్థ చేసినటువంటి 200 కోట్ల వ్యవహారానికి సంబంధించి   ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్దకు చేరిందట. మరి ఆ వ్యవహారం ఏంటి? దాంట్లో ఏమైనా స్కాం జరిగిందా? అనే వివరాలు చూద్దాం. జగన్ అధికారంలో ఉన్న సమయంలో జగనన్న  పేరుతో పేద ప్రజలకు సెంటు ఇళ్ల స్థలాలు అందించారు.

ఇల్లు కట్టిస్తామని అప్పటి ఎమ్మెల్యే  తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సంబంధించినటువంటి కాంక్రీట్ సంస్థ గవర్నమెంట్ నుంచి అడ్వాన్స్ తీసుకుంది. ఈ సంస్థ యొక్క ఖాతాకు బిల్లుల రూపంలో దాదాపుగా 200 కోట్లకు పైగానే ప్రభుత్వం చెల్లింపులు చేసిందట. కానీ ఇళ్లకు సంబంధించి నిర్మాణాలు ఎక్కడ జరగలేదు. దీంతో ఈ మ్యాటర్  గురించి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి  డైరెక్ట్ గా వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు చేశారట. వెంటనే స్పందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  దీనిపై విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విధంగా తీగలాగితే డొంక కదిలినట్టు ఈ వ్యవహారం అంతా చివరికి మాజీ ముఖ్యమంత్రి జగన్ వద్దకే చేరేలా కనిపిస్తుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: