తెలంగాణలో 38 మంది ఎమ్మెల్సీల పదవులు కట్.. కారణమిదే.?

Pandrala Sravanthi
తెలంగాణ రాష్ట్రం లో ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ పదవులను తొలగించే  విధంగా ప్రతిపక్షాలు ప్లాన్ లు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం శాసన మండలిలో 120 అసెంబ్లీ స్థానాలకు గాను  40 మంది ఎమ్మెల్సీలతో శాసన మండలి కొనసాగించడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ తెలంగాణ లో 2020 నాటికి  ఆంగ్లో ఇండియన్  సీట్ల ను రద్దు చేయడం వల్ల మొత్తం అసెంబ్లీ స్థానాలు 120 నుంచి 119 కి పడిపోయాయి. ఇదే తరుణంలో శాసన మండలి సంక్షోభానికి గురైందని చెప్పవచ్చు. తెలంగాణ శాసన మండలిని రాజ్యాంగ సంక్షోభం వెంటాడుతూనే ఉంది. 2020 జనవరిలో కేంద్రం రాష్ట్ర అసెంబ్లీ పార్లమెంటులో అయినటువంటి ఆంగ్లో ఇండియన్ సీట్లను రద్దు చేసింది.

 ఇదే తరుణంలో 120 ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119కి చేరాయి.  అయితే ఆర్టికల్ 171 ప్రకారం అసెంబ్లీ సీట్ల లో మూడో వంతు శాసన మండలి సీట్లు మించకూడదు. దీని ప్రకారం కనీసం 40 మంది ఎమ్మెల్సీలైనా సరే మనకు ఉండాలి. కానీ అంతకంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. కానీ ప్రస్తుతం శాసనమండలిలో మొత్తం 38 ఎమ్మెల్సీ స్థానాలు మాత్రమే ఉన్నాయని బీఆర్ఎస్ నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ అంటున్నారు. అయితే 40 కంటే తక్కువ ఉండడం వల్ల తెలంగాణ లో శాసన మండలి కొనసాగించడం  చట్ట విరుద్ధం అవుతుంది.

 అయితే నేను శాసన మండలి రద్దు చేయాలని కోరడం లేదు.కానీ రాష్ట్రంలో  జన గణన చేసి అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచాలని కోరుతున్నానని చెబుతున్నారు. ప్రస్తుతం రాజ్యాంగ విరుద్ధంగా కొనసాగుతున్న శాసనమండలిని రద్దు చేయాలని ఆయన చెప్పకనే చెబుతున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే విషయాన్ని పట్టుకొని ఎవరైనా కోర్టులో కేసు వేస్తే మాత్రం తప్పక తెలంగాణ శాసనమండలి రద్దయి 38 మంది ఎమ్మెల్సీ  పదవులు పోవడం ఖాయమని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: