రాయలసీమకు ప్రధాని మోడీ బంపర్ గిఫ్ట్ ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని.. డెవలప్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన సమయంలో కూడా... చాలా రోడ్లను సాంక్షన్ చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఆ పనులను మరింత వేగవంతం చేసేందుకు కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో రాయలసీమ ముఖచిత్రం త్వరలోనే మారబోతుందని తెలుస్తోంది.

అయితే ఇప్పుడు కేంద్రంలో... చంద్రబాబు చక్రం తిప్పుతున్న నేపథ్యంలో... ఏపీ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ ఫుల్ సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇందులో భాగంగానే... రాయలసీమలో ఆర్థిక అలాగే పారిశ్రామిక అభివృద్ధి కోసం తోడ్పడుతున్నారు. ప్రధానంగా కర్నూలు, అనంతపూర్ జిల్లాల మీదుగా వెళ్లే...హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిని ఇప్పుడు ఉన్న నాలుగు వరుసల నుంచి ఏకంగా 12 వరుసలకు... విస్తరించబోతున్నారు.
రెండు మెట్రో నగరాల మధ్య వాహనాల రద్దీని అలాగే.. ఫ్యూచర్ అవసరాల కోసం...  12 లైన్స్ గా రోడ్డును విస్తరించేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ఇక ఈ జాతీయ తరహ దారి దాదాపు 260 కిలోమీటర్ల పరిధి ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఈ జాతీయ రోడ్డు అయితే అక్కడ పరిశ్రమలు భారీగానే పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ జాతీయ రహదారికి... సమీపంలోనే నాలుగు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి.

ఎయిర్పోర్ట్స్ దగ్గర ఉన్న నేపథ్యంలో పారిశ్రామికవేత్తలు కూడా... రాయలసీమలో ఎక్కువ ఫ్యాక్టరీలను పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. బెంగళూరు కెంపగౌడ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్... ఈ జాతీయ రహదారి కి కేవలం 80 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇటు పెనుగొండ నుంచి పుట్టపర్తి ఎయిర్పోర్ట్.. 25 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా అంత దగ్గరగానే ఉంటుంది. అయితే..  ఈ జాతీయ రహదారిని పూర్తి చేసి వెంటనే పారిశ్రామికంగా రాయలసీమను అభివృద్ధి చేసేలా కేంద్రం ప్రణాళికలుచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: