జగన్ హెచ్చరిక ప్రమాదమేనా..టిడిపికి పట్టపగలే చుక్కలా.?

Pandrala Sravanthi
ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చాలా దారుణంగా ఓటమిపాలయ్యారు. 175 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 11 సీట్లు మాత్రమే గెలుపొంది  కనీసం ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి  ఓటమి తర్వాత ఇంకా గుణపాఠం నేర్చుకోలేదనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా అయిదు సంవత్సరాలు పాలించిన ఆయన  ఏ మాట మాట్లాడినా దాని వెనుక పూర్తిస్థాయి అర్థాన్ని వెతుకుతారు. కాబట్టి ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి.  ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అటు పార్టీకి ఆయన నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి జగన్ మోహన్ రెడ్డి  మాట్లాడే విధానాన్ని తప్పక మార్చుకోవాలని అంటున్నారు.  రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడితే కార్యకర్తలు రాబోవు రోజుల్లో అనేక ఇబ్బందులు పాలు కావాల్సి వస్తుంది. తాను చేయాల్సిన పని ఒక్కటే ప్రభుత్వం చేసే తప్పులను నిందించాలి. తన కార్యకర్తలతో ఎక్కడికక్కడ  ప్రజలతో మమేకం కావాలని చెప్పాలి.

 ఇది కాకుండా  రెచ్చగొట్టుడు ధోరణి మాటలు మాట్లాడితే మాత్రం పార్టీ దారుణంగా విఫలం అవుతుందని   చెప్పవచ్చు. సాధారణంగా తిట్టడం కొట్టడం అనేది తాత్కాలిక సంతోషం కిందికి వస్తుంది. ఇది మనుషుల మధ్య విపరీతమైనటువంటి శత్రుత్వాన్ని పెంచుతుంది. కానీ అలా చేయకుండా వ్యక్తి నచ్చకపోతే డైరెక్ట్ అభిప్రాయాన్ని చెప్పేయాలి. మాట్లాడితే ఆ కోపం అక్కడితోనే ఆగిపోతుంది. కానీ దుర్భాష వల్ల శత్రుత్వం అనేది పెరుగుతూనే ఉంటుంది. ఇది భవిష్యత్తుకే ఎంతో ప్రమాదకరమని అంటున్నారు. ముఖ్యంగా నాయకులు ఎవరు కూడా కర్రలు, కత్తులు పట్టుకొని దాడులు చేసుకోరు. కానీ ఆయనకిందున్నటువంటి కార్యకర్తలు కర్రలతో, కత్తులతో దాడులు చేసుకుంటారు ద్వంసాలు  చేస్తుంటారు. దీనికి ప్రధాన కారణం మనల్ని పాలించే నాయకుడు అని చెప్పవచ్చు.

నాయకుడు వాళ్ళని కంట్రోల్ చేస్తే అది అక్కడితోనే ఆగిపోతుంది. కానీ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పని చేయలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కలిసి టిడిపి నాయకులపై దాడులు చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చింది ఈ నాయకులు వైసిపి వాళ్లపై దాడులు చేస్తున్నారు. దీనిపై స్పందించాల్సినటువంటి అధినాయకులు ఏమాత్రం కూడా స్పందించడం లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రశాంతంగా మాటల ద్వారా పరిష్కరించుకుందాం అనుకుంటే ఆ దాడులు జరిగేవి కావు. దీంతో ప్రతికార దాడులు ఇప్పుడు టిడిపి వాళ్ళు చేస్తున్నారు. దీనిపై స్పందించినటువంటి జగన్ ఇప్పుడు మీరు గెలిచారు తర్వాత మేం గెలుస్తాం అంటున్నారు తప్ప,  దాడులతో కాదు మాటలతో చూసుకుందామని ఇప్పటికే అనడం లేదు. జగన్ మాట్లాడిన మాట రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంతో ప్రమాదకరమని భావించాలి. దీనివల్ల కార్యకర్తలు కేసులు జైళ్లు అంటూ ఇలా అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: