ఏపీ: ప్రాణహాని ఉందంటూ హైకోర్టును ఆశ్రయించిన వైసిపి నేత..!

Divya
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది వైసిపి నేతలకు సెక్యూరిటీని తొలగిస్తున్నారనే వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సెక్యూరిటీ విషయంలో వైసిపి నేత అంబాటి రాంబాబు హైకోర్టుకు సైతం ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. తనకు ప్రాణ హాని ఉందని.. అందుచేత  తనకు భద్రత పెంపునకు సహకరించాలి అంటూ అందుకు తగ్గట్టుగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలంటూ మాజీ మంత్రి వైసిపి నేత అంబాటి రాంబాబు సైతం హైకోర్టుని ఆశ్రయించారు. ఇప్పటివరకు ఉన్న 4+4 గన్ మ్యాన్ ల భద్రత ఉపసంహరించడం పై సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.

నిన్నటి రోజున న్యాయమూర్తి ఈ విషయం పైన విచారణ కూడా జరిగిప్పించారు. ఈ విషయంలో వాదనను వినిపించిన అంబాటి రాంబాబు తన తరఫున న్యాయవాది కూడా భద్రత కల్పించాలి అంటూ పల్నాడు ఎస్పీ డీజీపీకి వినతి పత్రాలను కూడా అందించడం జరిగింది. ఈ సందర్భంగా అంబటి రాంబాబు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారని ప్రశ్న లాయర్నీవేయగా అందుకు సమాధానంగా ఆయన గుంటూరులోనే ఉన్నారని ఆయన తరపున న్యాయవాది సమాధానం తెలియజేశారు. అయితే మరి పల్నాడులో వినతి పత్రం ఇస్తే ఎలా అంటూ అధికారులు ప్రశ్నించారు.

అంబాటి రాంబాబు న్యాయవాది మాత్రం అంబాటి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం పల్నాడు జిల్లా కిందికే వస్తుంది అంటూ తెలిపారట. ఆ జిల్లాకి వినతి పత్రం ఇచ్చామని ఇది పూర్తిగా టెక్నికల్ ఇష్యూ అంటూ కోర్టు తెలియజేసింది. మరి ఇలాంటి సమయంలో ప్రభుత్వం తరఫున న్యాయవాది ఎలా స్పందిస్తారు ఇందులో భాగంగా ఎలా తెలియజేస్తారని విషయం పైన చూడాల్సి ఉన్నది. ఇలాంటి నేపథ్యంలో తమ తదుపరి విచారణ ఈనెల 10వ తేదీ ఇచ్చి వాయిదా వేసినట్లు సమాచారం. ఇప్పటికే చాలామంది వైసిపి నేతలకు గన్మెన్లను కూడా తొలగించడం జరిగింది కూటమి ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: