షర్మిలను లేపడానికి రంగంలోకి ఇద్దరు ముఖ్యమంత్రులు?

Veldandi Saikiran
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు... వైయస్ షర్మిల... రాజకీయాల్లో సక్సెస్ అయ్యేందుకు చాలా కష్టాలు పడుతోంది. తెలంగాణలో వైసిపి పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసిన వైయస్ షర్మిల.. అక్కడ తోకముడిచింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి ఏపీ రాజకీయాలలో... అడుగుపెట్టింది షర్మిల. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియామకమైన షర్మిల... ఎంపీగా కూడా గెలవలేకపోయింది.
 

కానీ వైసీపీ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు ను మాత్రం కాంగ్రెస్ రూపంలో దెబ్బ కొట్టింది షర్మిల. అయితే ఏపీలో ఎలాగైనా సస్టెన్ కావడానికి... మరో బిగ్ స్కెచ్ వేసింది షర్మిల. సోమవారం రోజున వైయస్సార్ 75 వ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా విజయవాడలో ఓ పెద్ద కార్యక్రమాన్ని షర్మిల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి చాలామంది రాజకీయ నాయకులు రాబోతున్నారు.

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్, భట్టి విక్రమార్క, తెలంగాణ మంత్రులు ఈ కార్యక్రమం కోసం విజయవాడ వెళుతున్నారు. అంతేకాకుండా..  కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కూడా రంగంలోకి దిగుతున్నారు. ఇలా వరుసగా పెద్ద లీడర్లను రంగంలోకి దింపి... ఏపీలో తన ఇమేజ్ పెంచుకోవాలని షర్మిల చూస్తున్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ పార్టీ స్థానాన్ని భర్తీ చేసేలా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు చేస్తోంది. అందుకే షర్మిల పిలవగానే.... కర్ణాటక అలాగే తెలంగాణ నుంచి బడా లీడర్స్ వస్తున్నారు.  ఈ సభలో వైయస్సార్ కంటే.. కాంగ్రెస్ను హైలైట్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అలాగే షర్మిల ఇమేజ్  పెంచేలా  రాబోతున్న అతిధులు కూడా... మాట్లాడబోతున్నారట.  ఈ కార్యక్రమం అనంతరం కూడా.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర కు కూడా రంగం చేస్తున్నారట వైఎస్‌ షర్మిల.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: