టీమిండియాలో అడుగు పెట్టాడో లేదో.. రికార్డుల వేట మొదలెట్టాడు?

praveen
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఇరగదీశాడు. ఇన్నింగ్స్‌ల పరంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా తొలి శతకం నమోదు చేసిన మొట్టమొదటి భారత బ్యాటర్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. జింబాబ్వేతో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో 5 టీ20ల సిరీస్‌లో భాగంగా అభిషేక్ శర్మ ఈ ఘనత సాధించాడు. వివరాల్లోకి వెళితే... ఈ సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ శర్మ.. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో డకౌట్ కావడం గమనార్హం. కానీ రెండో మ్యాచ్‌లోనే శతకం నమోదు చేసి ఔరా అనిపించాడు. ఈ క్రమంలో 46 బంతుల్లో 7 బౌండరీలు, 8 సిక్స్‌లతో సెంచరీ సాధించాడు. ఈ ఘనతతో దీపక్ హుడా, కేఎల్ రాహుల్‌లను అభిషేక్ శర్మ దాటుకొని పోయాడు.
ఇకపోతే 3 ఇన్నింగ్స్‌ల వ్యవధిలో దీపక్ హుడా శతకం మధించగా, 4 ఇన్నింగ్స్ వ్యవధిలో కేఎల్ రాహుల్ సెంచరీ సాధించాడని విషయం అందరికీ తెలిసినదే. ఇక అంతర్జాతీయంగా తీసుకుంటే టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన 4వ భారత బ్యాటర్‌గా కూడా అభిషేక్ శర్మ గుర్తింపు పొందడం విశేషం. ఈ జాబితాలో 38 బంతుల్లో సెంచరీతో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉండగా.. సూర్యకుమార్ యాదవ్(45), KL రాహుల్(46), అభిషేక్ శర్మ(46) తర్వాతి స్థానాల్లో ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్‌లో 8 సిక్స్‌లు బాదిన అభిషేక్ శర్మ.. ఈ ఏడాది ప్రొఫెషనల్ టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ కి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 234 పరుగులు సాధించింది. ఈ క్రమంలో అభిషేక్ శర్మ శతకం సాధించగా, రుతురాజ్ గైక్వాడ్(47 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 77 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తా చూపించాడు. ఇక జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్బానీ, వెల్లింగ్టన్ మసకడ్జా తలో వికెట్ తీసారు. మొత్తంగా ఈ ఏడాది 18 టీ20 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ శర్మ 50 సిక్స్‌లు బాదగా.. రోహిత్ శర్మ 25 మ్యాచ్‌ల్లో 46 సిక్స్‌లతో 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. 25 మ్యాచ్‌లే ఆడిన విరాట్ కోహ్లీ 45 సిక్స్‌లతో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. శివమ్ దూబే(41), రియాన్ పరాగ్(33), రిషభ్ పంత్(31) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: