జనసేన: మార్పు చేసి చూపిస్తున్న పవన్ కళ్యాణ్.. హ్యాట్సాఫ్ అనాల్సిందే..?

Divya
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ నియమించడం జరిగింది. దీంతో పలు ప్రాంతాలను చుట్టేస్తూ ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్.. అలాగే జనసేన పైన కూడా ప్రజలలో మరింత బలాన్ని చేకూర్చే విధంగా నిర్ణయాలను తీసుకుంటూ ఉన్నారు. వాస్తవానికి గడచిన కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ దగ్గరకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ ని కేవలం 24 గంటల్లోనే పూర్తి చేశారు.

దీంతో పవన్ కళ్యాణ్ టీం కి చాలామంది హ్యాండ్సప్ చెప్పారు.. అయితే ఈ అమ్మాయి ఒక అబ్బాయి తో జమ్ము కాశ్మీర్లో ఉందనే విధంగా తెలియజేశారు. కానీ ఇప్పుడు తాజాగా మరో అసలు విషయం బయటికి వచ్చింది. అదేమిటంటే ఆ అమ్మాయిని భయపెట్టి మరి తీసుకువెళ్లారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ అమ్మాయికి లోకజ్ఞానం లేనటువంటి విషయాన్ని అడ్డుపెట్టుకొని మరి వారు చేసినటువంటి దుర్మార్గ పనులు ఇవే నట.. కాశ్మీర్లో దాదాపుగా 9 నెలలపాటు ఉంచగలిగాడంట. అయితే వాటి వెనకాల ఉన్న విషయాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది.

ఇదంతా పక్కన పెడితే.. అమ్మాయి తల్లి కంప్లైంట్ ఇచ్చి 9 నెలలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ.. తర్వాత పై అధికారుల దగ్గరకు వెళ్లిన .. అధికారులు నిర్లక్ష్యంగా అబ్బాయితో వెళ్లిపోయింది వారు మొబైల్ ఆన్ చేస్తే కనుక్కోవచ్చు లేకపోతే లేదు అనే అంతగా తెలియజేశారట. అలాంటి దశలో ఎక్కడికి వెళ్లాలో తెలియక.. ఆమె తల్లడిల్లి పోతూ పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టీం లో కొంతమంది పవన్ కళ్యాణ్ రాగానే ఈమె బాధను సైతం అక్కడ తెలియజేసేలా చేశారు. పవన్ కళ్యాణ్ కూడా విసుక్కోకుండా ఆమె బాధను విని వెంటనే kk అనే వ్యక్తికి చెప్పి మరి పనిచేయమని చెప్పారట. ముఖ్యంగా ఆ అమ్మాయి ఉన్నచోట మొబైల్ ఆన్ చేయగానే పోలీసులకు ఇన్ఫర్మేషన్ వెళ్లగానే అక్కడ సిబ్బందికి ఇక్కడ సిబ్బంది అలర్ట్ చేయగా వెంటనే అబ్బాయి దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయిని పట్టుకోవడం జరిగిందట. ముఖ్యంగా ఇక్కడ హ్యాట్సాఫ్ చెప్పాల్సింది పవన్ కళ్యాణ్ టీం కానీ చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: