వైసిపి: పార్టీ మార్పుపై అదిరిపోయే కౌంటర్ వేసిన అవినాష్ రెడ్డి..!

Divya
ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీ కేవలం నాలుగు లోక్సభ స్థానాలను మాత్రమే గెలిచింది.. అలాగే అసెంబ్లీలో 11 స్థానాలకే పరిమితమైంది. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీలు బిజెపిలోకి వెళుతున్నారంటూ జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.. కానీ తాము మాత్రం ఎలాంటి పార్టీలు మారే ప్రసక్తి లేదు అంటూ అంతటి కర్మ తమకు పట్టలేదంటూ వైసీపీ నేతలు కూడా దిమ్మతిరిగే కౌంటర్లు ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఇలాంటి వాక్యాల పైన ఎంపీ అవినాష్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది.

పూటకో పార్టీ మార్చే ఆదినారాయణ రెడ్డికి ఇటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తాయని తమకు ఇలాంటివి రావ్ అంటూ కౌంటర్ వేశారు.. తమ పార్టీ అధినేత జగన్ నాయకత్వంలోని వైసిపి ఎంపీలు ఎమ్మెల్యేలు పనిచేస్తారని తామంతా జగన్ వెంటే ఉంటామంటూ కూడా వెల్లడించారు.. ఎల్లో మీడియా పార్టీ మారుతుంది అంటూ ఒక దృశప్రచారాన్ని చేస్తున్నారని కడప ఎంపీగా మూడోసారి గెలిచినందుకు తనకు ఆనందంగా ఉందంటూ వెల్లడించారు.. ఎన్నికల ప్రచార సమయంలో తన పైన చాలా మంది తప్పుడు ఆరోపణలు చేశారని అయినా కూడా జగన్ తనకు సీటు ఇచ్చి తన ఆశీస్సులు ఇచ్చారని తెలియజేశారు.

తన గెలుపుకి నేతలు కార్యకర్తలు కృషి పట్టుదలే తనను గెలిపించాయంటూ తెలిపారు. టిడిపి గెలవగానే రాష్ట్రంలో శాంతిభద్రతలు కూడా కరువయ్యాయని 2019 ఎన్నికలలో తాము గెలిచిన తర్వాత కూడా సంబరాలు చేసుకున్నామని కానీ ఇలా ప్రత్యర్థి పార్టీల పైన ఎక్కడ దాడులు చేయలేదంటూ కూడా తెలియజేశారు.. ఒకవైపు వైసీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ మరొకవైపు టిడిపి పార్టీ నేతలు నీతి సూక్తులు చెబుతూ ఉన్నారు అంటూ ఫైర్ అయ్యారు అవినాష్ రెడ్డి. టిడిపి నేతలు కార్యకర్తలను సైతం అదుపులోకి పెట్టుకోవాలంటే హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా బిజెపి పార్టీలోకి చేరలేదంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: