దేవినేని ఉమా: దీన పరిస్థితిలో టీడీపీ కింగ్ మేకర్.. కీలక నేతకి ఇచ్చే మర్యాద ఇదేనా?

Purushottham Vinay

•పార్టీలో కింగ్ మేకర్‌లా వ్యవహరించిన దేవినేని ఉమాకి గడ్డు పరిస్థితి!

•తెలుగుదేశం పార్టీకి కీలక నేతగా ఎన్నో సేవలందించిన ఉమా!

•ఉమా తలరాతని మార్చేసిన 2019 ఎన్నికల ఫలితం!

ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్: తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడాయన ఎంతో కీలక నేతగా దేవినేని ఉమా తన సేవలని అందించారు. జిల్లాలో ఎక్కడ పార్టీ కార్యక్రమం జరిగినా కూడా ఖచ్చితంగా ఆయన ఉండాల్సిందే. అలాంటి కీలక నాయకుడికి ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకుండా పక్కకు నెట్టేశారు.ఆయన ప్రత్యర్థికి టిక్కెట్ ఇచ్చినా కూడా మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా పార్టీలో ఎక్కడా కనిపించడంలేదు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ కీలక నేత ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల్లో కీలకంగా, చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారిలో దేవినేని ఉమా మహేశ్వరరావు ఒకరు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇరిగేషన్ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే అదంతా కూడా ఆయన గత వైభవం. ఇప్పుడు పాపం దేవినేని ఉమా పేరు పార్టీలో ఎక్కడా కూడా వినిపించడం లేదు.

2014 ఎన్నికల్లో కృష్ణాజిల్లా మైలవరం నుంచి అసెంబ్లీకి ఎన్నికై చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత దేవినేనికి గడ్డు పరిస్థితులనేవి ఎదురయ్యాయి. ఉమా వ్యవహరించే తీరుతో నియోజకవర్గంలోని ముఖ్య నేతల నుంచి క్యాడర్ వరకు దేవినేని ఉమ మీద తిరుగుబాటు చేశారు. ఈసారి ఉమకు టిక్కెట్ ఇవ్వడానికి వీల్లేదని పార్టీ నాయకత్వానికి తెగేసి చెప్పడం జరిగింది.ఎన్నికల సమయంలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేగా ఉన్న వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వచ్చి మైలవరం టిక్కెట్ దక్కించుకున్నారు. వసంతకు టిక్కెట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు అప్పటి దాకా పార్టీలో కీలకంగా ఉన్న దేవినేని ఉమను పక్కన పెట్టేశారు.

ఎన్నికల్లో పార్టీ గెలిస్తే మంచి రోజులొస్తాయని బాబు చెప్పిన మాటను కాదనలేక  మైలవరంలో వసంతకు దేవినేని సహకరించారు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవినేని ఉమాను పార్టీ అధినేతతో సహా ఎవరూ కూడా పట్టించుకోవడం మానేశారు. బాబు మాటకు కట్టుబడి ఎన్నికల్లో వసంత గెలుపు కోసం కృషి చేసిన దేవినేని ఇప్పుడు కనీస గుర్తింపు కూడా లేకుండా పోయింది.ఎమ్మెల్యే టిక్కెట్ దక్కకపోయినా ... టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కచ్చితంగా తనకు సముచిత స్థానం దక్కుతుందని భావించిన దేవినేని ఉమాకు నిరాశే ఎదురయ్యింది.ఒకప్పుడు పార్టీలో కింగ్ మేకర్‌లా వ్యవహరించిన దేవినేని ఉమాకి ప్రస్తుత దీన పరిస్థితి వచ్చింది. మరి పార్టీ కోసం ఇంత చేసిన దేవినేని ఉమాకి చంద్రబాబు తగిన ఫలితం ఇచ్చి న్యాయం చేస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: