నంద్యాల రూపురేఖలు మార్చాల్సిన బాధ్యత బైరెడ్డి శబరిదే.. పాలనతో మెప్పిస్తారా?

Reddy P Rajasekhar
2024 ఎన్నికల్లో నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి బైరెడ్డి శబరి ఎంపీగా విజయం సాధించారు. వృత్తిరిత్యా రేడియాలజిస్ట్ అయిన బైరెడ్డి శబరి 40 సంవత్సరాల వయస్సులో ఎంపీగా విజయం సాధించారు. అయితే నంద్యాల రూపురేఖలు మార్చాల్సిన బాధ్యత బైరెడ్డి శబరిదే అని జిల్లా వాసులు కామెంట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయింది.
 
నంద్యాల పేరుకే జిల్లా అయినా జిల్లా స్థాయిలో అభివృద్ది జరగలేదని జిల్లావాసులు ఫీలవుతారు. బస్తాండ్, రైల్వే స్టేషన్ లతో పాటు రోడ్ల పరంగా అభివృద్ధి జరగాల్సి ఉంది. జిల్లాలో చెప్పుకోదగ్గ స్థాయిలో పరిశ్రమలు కానీ యువతకు ఉపాధి అవకాశాలు కానీ లేవు. జిల్లాలో కొన్ని రంగాల్లో ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశగా అడుగులు అయితే పడుతున్నాయని సమాచారం అందుతోంది.
 
బైరెడ్డి శబరి కుటుంబానికి దశాబ్దాలుగా రాజకీయ అనుభవం ఉంది. బైరెడ్డి శబరి తాత కూడా ఎమ్మెల్యేగా పని చేశారనే సంగతి తెలిసిందే. జిల్లా వాసులు బైరెడ్డి శబరికి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో నంద్యాల సమస్యలను పార్లమెంట్ లో ప్రస్తావించి న్యాయం జరిగే దిశగా శబరి అడుగులు వేయాల్సి ఉంది. బైరెడ్డి శబరి ఈ ఏడాది మార్చి నెలలో టీడీపీలో చేరి ఎంపీ టికెట్ సొంతం చేసుకుని తొలిసారి ఎంపీగా గెలిచి వార్తల్లో నిలిచారు.
 
నా గెలుపు నంద్యాల పార్లమెంట్ గెలుపు అని చెబుతున్న బైరెడ్డి శబరి నంద్యాల ఎన్నికలో గేమ్ ఛేంజర్ గా నిలిచారు. నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసిందని సంగతి తెలిసిందే. నంద్యాల జిల్లాలో ఈ తరహా ఫలితాలు వస్తాయని ఎవరూ ఊహించలేదు. అంచనాలకు అందని ఫలితాలు రావడం కూడా బైరెడ్డి శబరికి ప్లస్ అయింది. బైరెడ్డి శబరి ప్రజల అంచనాలను అందుకోవడంలో సఫలమవుతారో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని నెలలు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: