వాళ్లు వమ్ము చేసిన నమ్మకాన్ని కర్నూలు ఎంపీ నిలబెట్టుకుంటారా.. కర్నూలు కష్టాలు తీరుస్తారా?

Reddy P Rajasekhar
2014, 2019 ఎన్నికల్లో కర్నూలు జిల్లా ఎంపీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థులు విజయం సాధించినా గత పదేళ్లలో కర్నూలు జిల్లా పొందిన ప్రయోజనం దాదాపుగా శూన్యమనే చెప్పవచ్చు. అయితే ఆ నేతలు వమ్ము చేసిన నమ్మకాన్ని కర్నూలు టీడీపీ ఎంపీ బస్తిపాటి నాగరాజు నిలబెట్టుకుంటారని ప్రజలు నమ్ముతున్నారు. నాగరాజు ఉన్నత విద్యావంతుడు కావడంతో పాటు ఆయనకు ప్రజల సమస్యలపై అవగాహన ఉంది.
 
కర్నూలు మంత్రాలయం రైల్వే లైన్ గురించి దశాబ్దాల తరబడి చర్చ జరుగుతున్నా ఈ దిశగా అడుగులు పడలేదు. 54 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. మరోవైపు కర్నూలు స్మార్ట్ సిటీ కావాలని ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరగాలని ప్రజలు భావిస్తుండటం గమనార్హం. అయితే పార్లమెంట్ లో గళం విప్పి బస్తిపాటి నాగరాజు కర్నూలు వాసుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారేమో చూడాల్సి ఉంది.
 
కర్నూలు జిల్లాలో ఎన్నో సమస్యలు ఉండగా ఆ సమస్యలను నాగరాజు కచ్చితంగా పరిష్కరిస్తారని పరిష్కారం దిశగా అడుగులు వేస్తారని జిల్లావాసులు ఫీలవుతున్నారు. నాగరాజు పాలనలో కర్నూలు అభివృద్ధి జరగడంతో పాటు కర్నూలు వాసులకు ఉపాధి అవకాశాలు సైతం పెరుగుతాయేమో చూడాల్సి ఉంది. తొలిసారి ఎంపీగా ఎన్నికైన బస్తిపాటి నాగరాజు తన దృష్టికి వచ్చిన ప్రజల సమస్యలను ఇప్పటికే పరిష్కరిస్తున్నారు.
 
కురుబ సామాజిక వర్గానికి చెందిన ఈ నేత కర్నూలు అభివృద్ధి కోసం తన వంతు కష్టపడతానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ సైతం నియోజకవర్గ అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటానని వెల్లడించడం జరిగింది. చంద్రబాబు నాయుడు సైతం కర్నూలుకు ఒకింత ఎక్కువగానే ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. నిధుల మంజూరు విషయంలో కర్నూలుకు మేలు జరిగేలా చంద్రబాబు నిర్ణయాలను ప్రకటిస్తారేమో చూడాలి. కర్నూలుకు సంబంధించిన ప్రాజెక్ట్ లను సైతం త్వరితగతిన పూర్తి చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: