ఏపీ రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎప్పుడైనా సరే కింది స్థాయి కార్యకర్తల నుంచి ముఖ్యమంత్రి దాకా గెలిచినవారు ఓడిపోయిన వారిపై రివేంజ్ తీసుకుంటూ ఉంటారు. ఆనాడు 2019లో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజావేదిక భవనాన్ని కూల్చివేశారు. దీంతో చంద్రబాబు మరియు కింది స్థాయి నాయకులు నానా హైరానా చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ కుంటుపడిపోయింది అన్నారు. అలాంటి ఈ తరుణంలో 2024 ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. ఆనాడు జగన్ ఏ విధంగా ప్రజా వేదిక కూల్చివేశారో ఈనాడు చంద్రబాబు కూడా కూల్చివేత పనులు మొదలుపెట్టారు. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్నటువంటి వైసీపీ సెంట్రల్ పార్టీ ఆఫీసును కూటమి ప్రభుత్వం కూల్చివేసింది.
దీంతో వైసిపి నాయకులు అంతా విధ్వంస పాలన మొదలైందని ఆరోపిస్తున్నారు. అయితే అధికారుల అండతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిలోని 202/A1 సర్వే నెంబర్ లోని రెండు ఎకరాలు ఇరిగేషన్ భూమిని పార్టీ కార్యాలయానికి అప్పుడు జగన్ కేటాయించారు. ఇదే తరుణంలో రెండు ఎకరాల్లో భవనాలు కట్టి మిగతా భూమిని కొట్టివేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రణాళిక సిద్ధం చేశారని టిడిపి నాయకులు ఆరోపిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఈ స్థలం స్వాధీనం కోసం ఇరిగేషన్ శాఖ అంగీకారం పొందలేదు సిఆర్డిఓ, ఎంటిఎంఈ, రెవెన్యూ శాఖలో ఈ భూమిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి హ్యాండవర్ చేయలేదు.
కనీసం ఆ పార్టీ కార్యాలయానికి ప్లాన్ కోసం దరఖాస్తు కూడా చేయలేదు. కానీ నీటిపారుదల శాఖ భూమిని కబ్జా చేసి ఏ ఒక్క అనుమతి లేకుండా కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టారని, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగినటువంటి అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనుల్లో పడ్డారు. ఏది ఏమైనా ఆనాడు ఏదో జగన్ తెలియక , అనుభవం లేక ప్రజావేదికను కూల్చివేయించారు. 40 సంవత్సరాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు కూడా జగన్ చేసిన రాజకీయమే చేస్తున్నారు. జగన్ కు, చంద్రబాబుకు తేడా ఏముంది అంటూ కొందరు సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ఆనాడు జగన్ చేసింది తప్పైతే ఈనాడు చంద్రబాబు చేసింది కూడా తప్పే అంటూ ఆరోపిస్తున్నారు.