తెలంగాణవాసులకు ఏక కాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ.. అన్ని వేల రూ.కోట్ల ఖర్చా?

Reddy P Rajasekhar
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇచ్చిన ప్రధాన హామీలలో ఒకటైన రుణమాఫీ అమలుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆయన ఏకంగా పార్టీ 31 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనుందని చెబుతున్నారు. రుణమాఫీ అమలును మంత్రి మండలి ఏకగ్రీవంగా అమోదించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని రైతులందరికీ గడువులోగా రుణమాఫీ జరగనుందని సమాచారం అందుతోంది.
 
2018 సంవత్సరం డిసెంబర్ 12 వ తేదీ నుంచి 2023 సంవత్సరం డిసెంబర్ 9 వరకు ఐదేళ్ల కాలంలో రైతులు తీసుకున్న అన్ని రుణాలను మాఫీ చేయనున్నారని సమాచారం అందుతోంది. రైతు భరోసా నియమ నిబంధనలలో కూడా కీలక మార్పులు రానున్నాయని తెలుస్తోంది. రైతాంగానికి వ్యవసాయం పండగ చేయాలనే ఆలోచనతో మాత్రమే రుణమాఫీ అమలు చేస్తున్నామని ఆయన చెబుతున్నారు.
 
కేసీఆర్ సర్కార్ రెండుసార్లు రుణమాఫీ కోసం ఖర్చు చేసిన మొత్తంతో పోల్చి చూస్తే తమ ప్రభుత్వం రెట్టింపు మొత్తం కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయనుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతుభరోసా పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. రుణమాఫీ మార్గదర్శకాలపై అతి త్వరలో జీవో ఇస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. రుణమాఫీ అమలు దిశగా అడుగులు పడటంతో రైతులు ఎంతో సంతోషిస్తున్నారు.
 
స్పష్టమైన మార్గదర్శకాలు ఉండేలా నిబంధనలు ఉన్నాయని సమాచారం అందుతోంది. పీఎం కిసాన్ స్కీమ్ మార్గదర్శకాలకు అనుగుణంగా రైతు భరోసా స్కీమ్ అమలు కానుందని తెలుస్తోంది. సోమవారం రోజున ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు వెల్లడయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. రుణమాఫీ స్కీమ్ రైతుల జీవితాలను మార్చే అవకాశాలు ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  తెలంగాణ రాజకీయాలు ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచేలా రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రేవంత్ రెడ్డి పాలన సూపర్ అనేలా ఉందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: