ఏపీలో వైసీపీకి వరుస షాకులు.. ఈ ఘటనలపై ఏపీ ప్రజల రియాక్షన్ ఇదే!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. వైసీపీ టార్గెట్ గా జరుగుతున్న కొన్ని ఘటనలు ఆ పార్టీ నేతలను కలవరపెడుతున్నాయి. వైఎస్ భారతీరెడ్డి పీఏ పోలీసుల అదుపులో ఉండటం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. వైఎస్ భారతీరెడ్డి పీఏ వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.
 
టీడీపీ, జనసేన అధినేతలు, మహిళా నాయకులతో పాటు షర్మిల, సునీతలపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టడంతో రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారని భోగట్టా. వివేకా కూతురు సునీత హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు పులివెందుల-కదిరి మధ్యలో రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం అందుతోంది. వైసీపీ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రచారం చేస్తోంది.
 
రవీంద్రారెడ్డి ఎక్కువగా మహిళా నేతలనే టార్గెట్ చేశారని భోగట్టా. హోం మంత్రి అనిత టీడీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ ఉండవల్లి అనూషలపై సైతం గతంలో రవీంద్రారెడ్డి అసభ్యకరంగా పోస్టులు పెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు తాడేపల్లిలో వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేశారు. అక్రమ కట్టడం అంటూ ఈ కార్యాలయాన్ని కూల్చివేయడం జరిగింది. సీఆర్డీఏ ఆదేశాలపై వైసీపీ కోర్టును ఆశ్రయించినా పట్టించుకోకుండా కూల్చేశారని సమాచారం.
 
తెల్లవారకముందే సీఆర్డీఏ ఆదేశాల్ని అధికారులు అమలు చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ కక్ష సాధింపు చర్యలకు దూరమని చెబుతూనే కక్ష సాధింపులకు పాల్పడుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేయడం కోర్టు ధిక్కరణకు వస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ నేతలను భయపెట్టేలా టీడీపీ రాజకీయాలు చేస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ మాత్రం ఈ ఘటనలపై ఇంకా స్పందించాల్సి ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీపై దాడుల వల్ల టీడీపీ భవిష్యత్తులో తీవ్రస్థాయిలో నష్టపోయే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ తరహా దాడులు సరికావని కామెంట్లు వినిపిస్తున్నాయి.



 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: