చెల్లితో రాజీ చేయాలని తల్లిని కోరిన జగన్.. ఆ ఆరోపణల గురించి స్పందిస్తారా?

Reddy P Rajasekhar

మాజీ సీఎం వైఎస్ జగన్ కు 2024 ఎన్నికల ఫలితాలు భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. జగన్ ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు పొందడానికి చాలా కారణాలు ఉన్నా మూడు పార్టీలు కలిసి పోటీ చేయడమే వైసీపీ ఓటమికి కారణమని చాలామంది భావించారు. అయితే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి జగన్ గురించి అసెంబ్లీ లాబీలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
 
బీజేపీ అంగీకరిస్తే అవినాష్ రెడ్డి మినహా వైసీపీ ఎంపీలంతా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. కానీ బీజేపీ నాయకత్వం మాత్రం వాళ్లు అక్కర్లేదని చెబుతోందని ఆయన చెప్పుకొచ్చారు. బీజేపీ ఒప్పుకోకపోయినా మేం చేరతామంటూ మిథున్ రెడ్డి, మరి కొందరు లాబీయింగ్ చేస్తున్నారని ఆయన కామెంట్లు చేశారు. బీజేపీలో చేరాలని ఆయన తండ్రి పెద్దిరెడ్డిపై కూడా ఒత్తిడి తెస్తున్నారని ఆదినారాయణరెడ్డి వెల్లడించారు.
 
ఓదార్పు యాత్ర కోసం జగన్ మళ్లీ 14 కారణాలు వెతుక్కుంటున్నారని చెల్లి వల్లే నష్టపోయామని జగన్ తెలుసుకున్నాడని చెల్లితో రాజీ చేయాలని తల్లిని కోరాడని ఆయన అన్నారు. షర్మిల మాత్రం అన్ననే వచ్చి కాంగ్రెస్ లో చేరాలని చెప్పేసిందని ఆయన తెలిపారు. త్వరలోనే వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారని ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. కడప బై ఎలక్షన్ లో టీడీపీ తరపున భూపేశ్ రెడ్డి పోటీ చేసి గెలుస్తారని ఆయన తెలిపారు.
 
ఆదినారాయణ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యల గురించి వైసీపీ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది. వైసీపీ నేతలు సైలెంట్ గా ఉంటే మాత్రం ఈ ఆరోపణలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. వైసీపీ నేతలు యాక్టివ్ అయితే మాత్రమే విమర్శలు తగ్గే అవకాశాలు వెలువడే ఛాన్స్ ఉంటుంది. వైసీపీ వచ్చిన ప్రతి అవకాశన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లాల్సి ఉంది. కూటమిపై వ్యతిరేకత వైసీపీకి ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: