ప్రతిపక్షం లేని రాష్ట్రం ఏపీ మాత్రమేనా.. వైసీపీకి అక్కడ బలం లేకపోయినా ఇక్కడ బలం ఉందా?

Reddy P Rajasekhar
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్నాయనే సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం 9.46 గంటలకు అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి. కొత్తగా ఎన్నికైన అసెంబ్లీ సభ్యులతో ప్రమాణం చేయించడానికి అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక నిర్వహించడానికి ఈ సమావేశాలు జరగనున్నాయి. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారని భోగట్టా.
 
నేడు సాధారణ సభ్యుడిగానే జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. పేరులో మొదటి అక్షరం ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో సాధారణ సభ్యుల ప్రమాణం జరగనుందని తెలుస్తోంది. వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో ప్రతిపక్ష నేతగా ఉండే అవకాశం కూడా జగన్ కు లేకుండా పోయిందని సమాచారం అందుతోంది. ప్రతిపక్షం, ప్రతిపక్ష నేతలేని అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న రాష్ట్రం ఏపీ మాత్రమే కావడం గమనార్హం.
 
వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో వైసీపీ సభ్యుల పరిస్థితి ఏంటి? వాళ్లు ఏం మాట్లాడతారనే చర్చ సైతం జరుగుతోంది. మరోవైపు జగన్ కొన్నిరోజుల క్రితమే వైసీపీకి తగినంత బలం లేకపోవడం వల్ల గొంతు విప్పే అవకాశం రాకపోవచ్చని కామెంట్లు చేశారు. అయితే మండలిలో మాత్రం వైసీపీకి బలం ఉందని జగన్ వెల్లడించడం జరిగింది.
 
ఛాన్స్ ఉన్నా ప్రత్యేక హోదా అడగకపోవడం బాబు చేసిన మరో పాపమని కూటమి పాపాలు పండే వరకు ఆత్మ స్థైరాన్ని కోల్పోవద్దని జగన్ కామెంట్లు చేశారు కష్టాలు రావడం సాధారణం అని ఆ కష్టాలను ఎదుర్కొని నిలబడటం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. సమయం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు ముమ్మరం అవుతాయని కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపే కార్యక్రమం చేద్దామని జగన్ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరగబోతున్నాయనే చర్చ సైతం ప్రజల్లో జరుగుతోంది. ఎక్కువ సంఖ్యలో స్థానాల్లో వైసీపీ విజయం సాధించి ఉంటే పరిస్థితులు మరో విధంగా ఉండేవని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: