బాబు పాలనలో రేవంత్ కు చిక్కులు తప్పవా..?

Divya

•చంద్రబాబు పాలన.. ఏపీని చూసి రేవంత్ రెడ్డి నేర్చుకోవాలంటున్న బీఆర్ఎస్ నేతలు..
•గురువు పాలన శిష్యుడికి చిక్కులు తెచ్చిపెడుతోందా
•చంద్రబాబు దూకుడు కి రేవంత్ తట్టుకుంటారా..
(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)
అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే..  ఇక ఈసారి ఆయన విజయం సాధించకపోయి ఉండి ఉంటే కచ్చితంగా టిడిపి పార్టీ కనుమరుగయ్యేది అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఈసారి ఎలాగైనా సరే తన పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి కనబరచాలని తెగ ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు.. అందులో భాగంగానే ముఖ్యమంత్రి పదవికి సంతకం చేసిన వెంటనే పలు అంశాలను దృష్టిలో పెట్టుకొని వాటిని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రబాబు పాలనలో చిక్కులు తప్పేలా కనిపించడం లేదు.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
వాస్తవానికి చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరూ గురు శిష్యులు అన్న విషయం అందరికీ తెలిసిందే.  ఇద్దరు కూడా ఒకరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మరొకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నారు.  ఇలాంటి సమయంలో గురు శిష్యుల మధ్య రాజకీయ చిచ్చు  కనిపిస్తోంది.
చంద్రబాబు చేస్తున్న పనులను.. తెలంగాణ యువత, రైతులు, ప్రజలు అందరూ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తొలిరోజే మెగా డీఎస్సీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు..  స్కిల్ సెన్సెస్ కూడా చేపట్టనున్నట్టు చంద్రబాబు తెలిపారు..  ముఖ్యంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర యువత దృష్టిని ఆకర్షించింది అని చెప్పవచ్చు.. నిజానికి టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉద్యోగాలు లేవని.. ధర్నాలు కూడా చేసిన యువత..  కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయి అని..  పెద్ద ఎత్తున ప్రచారం చేసి రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చింది. దీంతో నిరుద్యోగ యువత పక్షాన ఉన్న బిఎస్ఆర్ పార్టీ రెండు లక్షల ఉద్యోగాల భర్తీపైన ఫోకస్ చేయాలని.. 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తోంది.. ఇక ఇచ్చిన హామీని నెరవేర్చకుండా గాలికి వదిలేసిన రేవంత్ రెడ్డి ఏపీని చూసిన నేర్చుకోవాలని బీఆర్ఎస్ నేతలు కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. మరొకవైపు పోలవరం ప్రాజెక్టు పనులు కూడా చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు...
 ఇక అందులో భాగంగానే ఆయన పోలవరం ప్రాజెక్టు వల్ల ఎన్ని మండలాల ప్రజలు బాగుపడతారు అనే విషయంపై కూడా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే.. రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల విషయంలో ఇంకా ఎటువంటి చొరవ తీసుకోలేదు.. ఇవన్నీ కూడా చంద్రబాబు కారణంగా రేవంత్ రెడ్డికి చిక్కులు వచ్చేటట్టు కనిపిస్తున్నాయి. మరి ఇకనైనా గురువుని చూసి శిష్యుడు ఏం నేర్చుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: